తెలంగాణ

telangana

అద్భుతం.. టెస్లా కార్ల లైట్లతో 'నాటు నాటు' షో.. వీడియో చూశారా?

By

Published : Mar 20, 2023, 2:19 PM IST

టెస్లా కార్ల లైట్ షోలో ఆస్కార్ విన్నింగ్ సాంగ్​ 'నాటు నాటు' సాంగ్​ దుమ్మురేపింది. ఆ పాటకు సింక్​ అయ్యేలా కార్ల లైట్లు ఆన్​ చేస్తూ.. ఆఫ్​​ చేస్తూ ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Naatu Naatu craze continues: Tesla cars line up to sync car lights to Oscar winning RRR song's beats
Naatu Naatu craze continues: Tesla cars line up to sync car lights to Oscar winning RRR song's beats

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. రూ.1200 కోట్లు వసూళ్లు సాధించి వారెవ్వా అనిపించింది. ప్రపంచ ప్రఖ్యాత అవార్డులను దక్కించుకోవడంలో దుమ్మురేపింది. 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' పాట ఆస్కార్ అవార్డును అందుకుంది. ఒరిజినల్ సాంగ్‌గా అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతకు ముందే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సైతం అందుకుంది.

కార్ల లైట్ షోలో దుమ్మురేపిన 'నాటు నాటు'
'నాటు నాటు' పాట ఆస్కార్ గెలిచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. 'నాటు నాటు'కు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, రీల్స్​ ఇంటర్నెట్​లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా న్యూజెర్సీలో టెస్లా లైట్ షో 'నాటు నాటు' పాటతో దుమ్మురేపింది. ఈ పాటకు లయబద్దంగా కార్ల లైట్లు ఆన్​ చేస్తూ, ఆర్పేస్తూ ఆకట్టుకున్నారు. నాటు పాటకు సింక్ అయ్యేలా లైట్స్ వేస్తూ అదుర్స్ అనిపించారు. కాసేపు ఆ ప్రాంతమంతా నాటు నాటు పాటతో దుమ్ములేచింది. అక్కడున్న వాళ్లంతా పాటకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ లైట్ షో వీడియోను ఆర్​ఆర్​ఆర్​ టీమ్ ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. తెలుగు పాట విశ్వవ్యాప్తంగా సందడి చేయడం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నాటు నాటుకు అమెరికా పోలీసుల స్టెప్పులు
ఇటీవలే అమెరికా పోలీసులు 'నాటు నాటు' పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో స్థిరపడిన కొంతమంది ప్రవాస భారతీయులు హోలీ ఆడుతుండగా, ఇద్దరు పోలీసులు వారితో కలిసి హుక్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. సదరు పోలీసులకు మధ్యలో నిలబడిన భారతీయ వ్యక్తి పోలీసులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. ప్రజల కేరింతల మధ్య వారు చక్కటి స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు.

జర్మనీ ఎంబసీ సిబ్బంది డ్యాన్స్​..
జర్మనీ ఎంబసీ సిబ్బంది 'నాటు నాటు' పాట ఆస్కార్ విజయాన్ని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. వారంతా కలసి దిల్లీలోని చాందినీ చౌక్ వద్ద అదిరిపోయే స్టెప్పులతో సందడి చేశారు. దీన్ని మొత్తం ఓ వీడియో రూపంలో రికార్డు చేశారు. ఆ వీడియోను జర్మనీ అంబాసిడర్ ఫిలిప్ అకేర్మాన్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక వీరు చేసిన వీడియోలో.. జర్మనీ ఎంబసీ సిబ్బంది దిల్లీ వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈలోగా అక్కడ నాటు నాటు పాట ట్యూన్ వినగానే అందరికీ ఉత్సాహం మొదలవుతుంది. తర్వాత అంతా కలసి 'నాటు నాటు' అంటూ డాన్స్ చేస్తుంటే చుట్టుపక్కల వారంతా ఎగబడి చూస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details