తెలంగాణ

telangana

MAA Association : 'మా'లో ట్విస్ట్.. వచ్చే ఎన్నికల్లో పోటీకి మంచు విష్ణు దూరం.. అసలేం జరిగిందంటే!

By

Published : Jul 31, 2023, 5:51 PM IST

Updated : Jul 31, 2023, 6:45 PM IST

MAA Association : 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.

MAA Association Elections
మా అసోసియేషన్ ఎన్నికలు

MAA Association : మా అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రీసెంట్​గా జరిగిన మా అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో.. సభ్యులకు తన నిర్ణయాన్ని వివరించారట. అలాగే సెప్టెంబర్​లో ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అసోసియేషన్​లో ఆడిట్ సమస్యల కారణంగా ఎన్నికలను మే లో నిర్వహించాలని అసోసియేషన్ సభ్యులు తీర్మానించినట్లు సమాచారం. అయితే వచ్చే ఎన్నికల్లోపు సభ్యులకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని.. మా అధ్యక్షుడు విష్ణు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగిన మర్నాడే.. 'మా' అధ్యక్షుడి నిర్ణయం సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

MAA Elections 2021 : మంచు విష్ణు 2021లో జరిగిన 'మా' ఎన్నికల్లో.. సీనియర్ నటుడు ప్రకాశ్​రాజ్​పై 109 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా హీరో శ్రీకాంత్, ట్రెజరర్​గా శివబాలాజీ గెలుపొందారు. అప్పట్లో మా అధ్యక్షుడి ఎన్నిక.. సాధారణ ఎన్నికలను తలపించాయి. నటుడు ప్రకాశ్​ రాజ్​కు మెగా ఫ్యామిలీ సైతం మద్ధతుగా నిలిచింది. కాగా మరోవైపు కుమారుడి గెలుపు కోసం హీరో మోహన్​బాబు స్వయంగా రంగంలోకి దిగారు.

విష్ణు ప్యానెల్​ నుంచి సీనియర్ కమెడియన్ బాబు మోహన్, కరాటే కల్యాణి, నటులు శివ బాలాజీ, గౌతమ్​ రాజు, పృథ్వీ రాజ్, రఘు బాబు పోటీ చేశారు. మరోవైపు ప్రకాశ్ రాజ్ ప్యానెల్​లో హీరో శ్రీకాంత్, బెనర్జీ, ఉత్తేజ్, జీవితా రాజశేఖర్, హేమ, నాగినీడు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్​ నుంచి ఎనిమిది మంది విజయం సాధించగా.. మంచు విష్ణు ప్యానెల్​ నుంచి పది మంది సభ్యులు గెలుపొందారు.

కాగా 1993 లో తెలుగు సినిమా నటీనటుల సంక్షేమం కోసం 'మా' ను ఏర్పాటు చేశారు. 'మా' అసోసియేషన్​కు 1993 -95 మధ్య కాలంలో మొదటి అధ్యక్షుడిగా మెగాస్టార్ చిరంజీవి బాధ్యతలు నిర్వర్తించారు. 150 మందితో ప్రారంభమైన అసోసియేషన్​లో.. ప్రస్తుతం 9 వందలకు పైగా మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. గడిచిన 30 ఏళ్ల కాలంలో ఆసోసియేషన్​లో.. నటుడు మురళీ మోహన్ అత్యధికంగా 5 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఇక మంచు విష్ణు టాలీవుడ్​లో హీరో కమ్ నిర్మాతగా రాణిస్తున్నారు. కాగా 2007లో 'ఢీ' సినిమాతో విష్ణు.. సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత సలీం, వస్తాడు నారాజు, దేనికైనా రెడీ, దూసుకెళ్తా ఇలా వరుస సినిమాలు నిరాశ పరిచాయి. మంచు కుటుంబం నుంచి హీరో మోహన్​ బాబు, విష్ణు, మనోజ్ కలిసి 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

TFCC Elections 2023 : తాజాగా జరిగిన తెలుగు ఫిల్మ్​ ఛాంబర్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దిల్​రాజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి సి. కల్యాణ్​పై 17 ఓట్ల తేడాతో దిల్​రాజు విజయం సాధించారు.

Last Updated : Jul 31, 2023, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details