తెలంగాణ

telangana

అక్కడ 'బాహుబలి 2' రికార్డును బ్రేక్​ చేసిన కమల్​ 'విక్రమ్'​

By

Published : Jun 19, 2022, 1:55 PM IST

Kamalhassan Vikram collections: దిగ్గజ నటుడు కమల్​హాసన్​ నటించిన 'విక్రమ్'​ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 16 రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లను అందుకుంది. ఓ రాష్ట్రంలో ఏకంగా 'బాహుబలి 2' రికార్డులను అధిగమించింది.

Kamalhassan collections break bahubali 2 records
'బాహుబలి 2' రికార్డును బ్రేక్​ చేసిన కమల్​ 'విక్రమ్'​

Kamalhassan Vikram breaks Bahubali 2 collections: యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​ కెరీర్​లోనే బిగ్గెస్ట్​ బ్లాక్​బస్టర్​గా నిలిచిన చిత్రం 'విక్రమ్​'. గ్యాంగస్టర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్​హాసన్​తో పాటు విజయ్​సేతుపతి, ఫహద్​ ఫాజిల్​ కీలక పాత్రలు పోషించారు. అతిథి పాత్రలో సూర్య 'రోలెక్స్'గా​ అదరగొట్టేశాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.360కుపైగా కోట్లు వసూళ్లు అందుకుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మొత్తం కలెక్షన్స్‌లో సగం అంటే రూ.150 కోట్లు కేవలం తమిళనాడు నుంచే వచ్చాయని తెలిసింది. దీంతో ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో ఉన్న 'బాహుబలి-2' కలెక్షన్స్‌ రికార్డుని 'విక్రమ్‌' అధిగమించింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్లే అవకాశముంది.

సినిమా కథేంటంటే.. 'విక్రమ్‌'... పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. గ్యాంగ్‌స్టర్‌, ఆయన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీస్‌ బృందానికి మధ్య జరిగే పోరు ఇది. ఇందులో కమల్‌హాసన్‌.. కర్ణన్‌ అనే పాత్రలో నటించారు. భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్న పోలీస్‌ అధికారి ప్రభంజన్‌, ఆయన తండ్రి కర్ణన్​ను (కమల్‌హాసన్‌) ఓ ముఠా చంపేస్తుంది. ఈ డ్రగ్స్‌ దందాను నిలువరించి, హత్యలకు పాల్పడుతున్న ఆ ముఠాను పట్టుకునేందుకు అమర్‌(ఫహద్‌ ఫాజిల్‌) అనే స్పై ఏజెంట్‌, అండర్‌ కవర్‌ ఆఫీసర్‌ రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తు చేస్తోన్న సమయంలో ఈ డ్రగ్స్‌ మాఫియా వెనుక సంతానం (విజయ్‌ సేతుపతి) హస్తం ఉన్నట్లు గుర్తిస్తాడు. అంతేకాకుండా కర్ణన్‌ బతికే ఉన్నట్లు తెలుసుకుంటాడు. అసలు కర్ణన్‌ ఎవరు? చనిపోయినట్లు ఎందుకు బయటప్రపంచాన్ని నమ్మించాడు? అమర్‌ ఈ కేసును ఎలా చేధించాడు? రోలెక్స్‌ (సూర్య) పాత్ర ఏమిటి?.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో లోకేశ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు.

ఇదీ చూడండి:'విరాటపర్వం.. ఆ విమర్శల్లో ఏమాత్రం నిజం లేదు'

ABOUT THE AUTHOR

...view details