తెలంగాణ

telangana

మొన్న గుర్రపు స్వారీ.. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్​.. ఆ సినిమా కోసం కాజల్​ హార్డ్​ వర్క్​!

By

Published : Sep 25, 2022, 5:12 PM IST

Updated : Sep 25, 2022, 5:17 PM IST

హీరోయిన్ కాజల్​ అగర్వాల్‌ బాడీ ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి పెట్టారు. ఇటీవలే గుర్రపు స్వారీ నేర్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మార్షల్​​ ఆర్ట్స్​పై ఫోకస్​ చేసినట్లు సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు.

kajal practicing marshal arts for indian two movie
kajal practicing marshal arts for indian two movie

Kajal Marshal Arts: తల్లి అయ్యాక శరీరాకృతిలో వచ్చిన మార్పుల వల్ల కాస్త బొద్దుగా మారిన స్టార్​ హీరోయిన్​ కాజల్​ అగర్వాల్.. ఇప్పుడు బాడీ ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఇటీవల గుర్రపుస్వారీ నేర్చుకున్న కాజల్‌.. తాజాగా మార్షల్‌ ఆర్ట్స్‌పై ఫోకస్​ పెట్టారు. ట్రైనర్‌ సమక్షంలో తన తదుపరి చిత్రం 'ఇండియన్‌ -2' కోసం చెమటలు చిందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

'కళరిపయట్టు' అనేది ఓ పురాతన కేరళ యుద్ధ కళ. దీని నుంచే కుంగ్‌ ఫు, కరాటే, తైక్వాండో వంటి ఎన్నో మార్షల్‌ ఆర్ట్స్‌ పుట్టుకొచ్చాయి. గెరిల్లా యుద్ధానికి దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. దీన్ని సాధన చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా శక్తిని పొందొచ్చు. గడిచిన మూడేళ్లు నుంచి సమయం దొరికొనప్పుడల్లా దీన్ని నేర్చుకొంటున్నందుకు సంతోషిస్తున్నా" అంటూ ఇన్​స్టాలో కాజల్​ రాసుకొచ్చారు.

కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఇండియన్‌ 2' చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో విడుదలైన 'భారతీయుడు'కు సీక్వెల్‌గా ఇది సిద్ధమవుతోంది. ఇందులో కమల్‌కు జోడీగా కాజల్‌ కనిపించనున్నారు. నిర్మాణ సంబంధ విభేదాలు, సెట్‌లో క్రేన్‌ ప్రమాదం వంటి కారణాల వల్ల సుమారు ఏడాది కాలంపాటు వాయిదా పడిన ఈ సినిమా ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ప్రస్తుతం కమల్‌ హాసన్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఇవీ చదవండి:చీరకట్టులో సీరియల్ నటి అందాల విందు.. ధర తెలిస్తే అవాక్కే!

బాలయ్య 'చెన్నకేశవరెడ్డి' రీరిలీజ్​.. థియేటర్లు హౌస్​ఫుల్​.. ఫ్యాన్స్​ రచ్చరచ్చే

Last Updated : Sep 25, 2022, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details