తెలంగాణ

telangana

NTR 31 అప్డేట్​- స్టోరీ చాలా కొత్త ఉంటుందట! నీల్​ మామ ఏం చేస్తాడో?

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 7:29 PM IST

Updated : Dec 6, 2023, 7:42 PM IST

Jr NTR Prashanth Neel Movie : టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్​టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న సినిమా స్టోరీ గురించి అప్​డేట్ వచ్చింది. రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైకెర్టర్ ప్రశాంత్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు.

Jr NTR Prashanth Neel Movie
Jr NTR Prashanth Neel Movie

Jr NTR Prashanth Neel Movie :పాన్ఇండియా స్టార్ జూ. ఎన్​టీఆర్ - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కునున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఎన్​టీఆర్ 31 (వర్కింగ్ టైటిల్) పేరుతో ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేసింది మూవీటీమ్. అయితే 'కేజీఎఫ్'​తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల ప్రాజెక్ట్​పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రేజీ కాంబో నుంచి ఎప్పుడెప్పుడు అప్​డేట్ వస్తుందా? అని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రీసెంట్​గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సినిమా స్టోరీ లైన్​ గురించి ఓ హింట్ ఇచ్చారు.

"విభిన్నమైన ఎమోషన్స్​తో ఈ సినిమా కొత్తగా ఉండబోతోంది. నేను సినిమా జానర్​ గురించి మాట్లాడను. కానీ, ఫ్యాన్స్​ అందరూ ఇది పెద్ద యాక్షన్ ఫిల్మ్​ అని ఊహించుకుంటున్నారు. అయితే నా ఆడియన్స్​కు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇదివరకు లాగా కాకుండా ఈ సినిమాను కొత్త జానర్​ కథతో తెరకెక్కిస్తున్నా. ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా కథ ఉంటుంది" అని అన్నారు. దీంతో సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా,ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది (2024) ద్వితీయార్థంలో ప్రారంభం అవుతుందని, మొత్తం 18 దేశాల్లో చిత్రీకరణ ఉండనుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంత ఉందో కానీ, ఎన్​టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు.

Devara Movie : ఎన్​టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. సినిమా పక్కా పవర్​ఫుల్​ యాక్షన్ ప్యాక్డ్​ ఎంటర్​టైనర్​గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలనాటి నటి దివంగంత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ఈ సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌-యువసుధ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న సినిమా గ్రాండ్​గా థియేటర్లలో విడుదల కానుంది.

Devara VFX : 'దేవర' షాకింగ్​ న్యూస్​.. రూ.100కోట్ల బడ్జెట్​తో వీఎఫ్​ఎక్స్​ షురూ..

'ఎన్టీఆర్‌ 31' ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. ఎన్టీఆర్‌ లుక్​ అదుర్స్​

Last Updated : Dec 6, 2023, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details