తెలంగాణ

telangana

వర్షతో సుధీర్ రొమాన్స్​.. చిర్రెత్తిపోయిన ఇమ్మూ.. రష్మి ఏం చేస్తుందో?

By

Published : Nov 12, 2022, 10:40 AM IST

Updated : Nov 12, 2022, 10:45 AM IST

యాంకర్‌ రష్మి-సుడిగాలి సుధీర్‌, వర్ష-ఇమ్మాన్యుయెల్‌ ఈ రెండు జంటల ఆన్​స్కీన్​ కెమిస్ట్రీ, ఆఫ్​స్క్రీన్ కెమిస్ట్రీ బుల్లితెర ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్​ సంపాదించుకుంది. ఎంతలా అంటే ఈ జంటల గురించి చిన్న విషయం బయటకు వచ్చినా సరే ప్రేక్షకులంతా దాని గురించి తెలుసుకునేందుకు ఎంటో ఉత్సుకత చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు సీన్​ రివర్స్ అయ్యింది. సుధీర్‌ను రష్మి ఛీ కొట్టగా! అతడితో రొమాన్స్​ చేయడానికి సిద్ధమైంది వర్ష. అసలేం జరిగిందంటే..

Jabardast latest promo
వర్షతో సుధీర్ రొమాన్స్​.. చిర్రెత్తిపోయిన ఇమ్మూ.. రష్మి ఏం చేస్తుందో

టెలివిజన్​ స్క్రీన్ ఎవర్​గ్రీన్​ పెయిర్​ యాంకర్‌ రష్మి-సుధీర్‌. అలానే తమ లవ్​, కామెడీ అండ్​ కలర్ కాంబినేషన్​తో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న జోడీ ఇమ్మాన్యుయెల్‌- వర్ష . ఈ జంటలిద్దరూ తమదైన కామెడీతో అలరిస్తూ, ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు సీన్‌ రివర్స్ అయ్యింది. ఇమ్మాన్యుయెల్​కు పెద్ద ఇబ్బందే వచ్చి పడింది. రష్మి హ్యాండ్​ ఇవ్వడంతో వర్షతో పులిహోర కలిపాడు సుధీర్‌. దానికి పడిపోయిన వర్ష .. అతడితో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఇమ్మూకు కోపంతో ఊగిపోయాడు.

ఫిట్టింగ్​ పెట్టేశాడుగా.. కొద్ది కాలంగా జబర్దస్త్​ షోకు కాస్త గ్యాప్ ఇచ్చిన సుధీర్​.. వచ్చీ రాగానే పెద్ద ఫిట్టింగే పెట్టాడు. షోలో ఇతర కమెడియన్ల పార్ట్నర్స్​ను కదలించడం షురూ చేశాడు. ఈ క్రమంలోనే షోలో మరోసారి రష్మికి ప్రపోజ్‌ చేశాడు. వాడిపోయిన గులాబి పువ్వుని తీసుకుని 'నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ, నువ్వే ఏడిస్తే నేను చచ్చిపోతా' అని మరోసారి తన పాపులర్‌ డైలాగ్‌ను చెప్పి ప్రపోజ్ చేశాడు. అయితే రష్మి పెద్ద షాకిచ్చింది. 'చావు రా చావు' అంటూ ముఖం మీదే చెప్పేసింది. దీంతో సుధీర్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. షోలో నవ్వులు విరిసాయి.

ఆ తర్వాత షోలో భాగంగా గాలి వారి పెళ్లి పిలుపు అనే కార్యక్రమంలో ఊహించని విధంగా వర్షతో కలిసి స్టెప్పులేశాడు సుధీర్‌. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలోనే త్వరగా పెళ్లి చేసుకోమంటూ సుధీర్‌ను నిలదీసింది వర్ష. మన పెళ్లి అసలు అవుతుందా లేదా అని అడగగా, 'గాలోడు' రిలీజ్‌ కాగానే పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు సుధీర్‌. సరే నాకు అర్థమైంది ఇది అవదని అంటూ చెప్పడంతో సుధీర్‌కు షాక్ తగిలింది.

ఇక సుధీర్​తో బ్రేకప్​ చెప్పిన వర్ష.. ఇమ్మూతో పెళ్లికి సిద్ధపడింది. అయితే ఈ వివాహ కార్యక్రమానికి ఫొటోగ్రాఫర్​గా సుధీర్ ఎంట్రీ ఇచ్చి​ మళ్లీ వర్షతో పులిహోర కలిపాడు. రొమాంటిక్​గా తనను హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఇదంతా గమనించి చిర్రెత్తిపోయిన ఇమ్మూ.. సూధీప్​పై ఫైర్ అయ్యాడు. మళ్లీ ఎందుకొచ్చావ్‌ రా అంటూ విరుచుకుపడ్డాడు. దీంతో మరోసారి షో నవ్వులతో దద్దరిల్లిపోయింది.

ఆవేశంలో సోఫాలో కూర్చొని ఊగిపోతున్న ఇమ్మూను కూల్‌ చేయాలని భావిస్తాడు ఈవెంట్‌ మేనేజర్‌ భాస్కర్‌. మంచి ఆర్కేస్టా ఉన్నాడు అద్భుతంగా పాటలు పాడతాడని చెప్పడంతో.. పాడమని గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడు ఇమ్మూ. దీంతో మళ్లీ సుధీర్‌ వచ్చి వర్ష పక్కన కూర్చొని 'నాతో వస్తావా నాతో వస్తావా.. 'అంటూ పాట పాడుతుండగా, దానికి వర్ష కూడా వస్తా అన్నట్టుగా తలూపుతూ తాను కూడా పాట పాడుతుంది. మధ్య ఇమ్మాన్యుయెల్‌ కూడా పాట అందుకుని మరింతగా రెచ్చిపోయాడు. ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ ప్రోమోను మీరు చూసేయండి..

ఇదీ చూడండి:బ్యాట్​మెన్​ స్వరం మూగబోయింది.. ఆయన ఇక లేరు

Last Updated : Nov 12, 2022, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details