తెలంగాణ

telangana

'సర్కారు వారి పాట' సక్సెస్​..  పరశురామ్​, మహేశ్ ఏమన్నారంటే?

By

Published : May 18, 2022, 4:51 PM IST

Sarkaruvaaripaata movie success: 'సర్కారువారి పాట' విజయం సాధించడంపై సూపర్​స్టార్​ మహేశ్​బాబు సహా చిత్ర దర్శకుడు పరశురామ్‌ హర్షం వ్యక్తం చేశారు. సినిమాను ఆదరించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం చూసి దర్శకుడు పూరి జగన్నాథ్​ ఏమన్నారో పరశురామ్​ తెలిపారు.

sarkaru varipata movie success
సర్కారు వారి పాట సక్సెస్​

Sarkaruvaaripaata movie success: సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించిన సమ్మర్​ సెన్సేషనల్​ 'సర్కారు వారి పాట' ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్​హిట్​ టాక్​ సొంతం చేసుకుంది. ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాక్సాఫీస్​ వద్ద భారీ కలెక్షన్లను అందుకుంటోంది. మహేశ్‌ క్లాస్‌ లుక్స్‌, మాస్‌ డైలాగ్‌లతో ఈ సినిమా అభిమానులకు కలర్‌ఫుల్‌ ట్రీట్‌గా మారింది. చాలా రోజుల తర్వాత మహేశ్‌ని ఇలాంటి రోల్‌లో చూడటంపై వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్​ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు చిత్ర దర్శకుడు పరశురామ్​. సినిమా కోసం పనిచేసిన ప్రతిఒక్కరికి, ఆదరించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

"ఓవర్సీస్​, దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు సినిమాను బాగా ఆదరించి సూపర్​హిట్​ చేశారు. మంచి కథ చేశారని అని ప్రశంసిస్తున్నారు. ఫ్యాన్స్​ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రేక్షకులు.. ఈ మూవీని హిట్​ చేయడంతో పాటు ఈ సినిమాకు ఇస్తున్న రెవెన్యూ, ప్రశంసలు మాకు ప్రోత్సహాన్ని ఇచ్చాయి. సూపర్​ స్టార్​ కృష్ణ.. ఈ చిత్రాన్ని చూసి 'పోకిరి', 'దూకుడు' కన్నా పెద్ద హిట్​ అవుతుందని అన్నారు. ఈ ప్రశంసతో నేను పడ్డ కష్టానికి తగిన గుర్తింపు లభించిందని అనిపించింది. నా సినిమా ఆయనకు నచ్చడం అదృష్టవంతుడిగా భావిస్తున్నా. ఈ చిత్రాన్ని చూసి మొదట దర్శకుడు పూరి జగన్నాథ్​ ఫోన్​ చేశారు. మూవీ అదిరిపోయిందని చెప్పారు. చాలా ఎత్తుకు ఎదిగావని ప్రశంసించారు. డైరెక్టర్స్​ సుకుమార్​, గోపిచంద్​ మలినేని, హరీశ్​ శంకర్​, మెహర్​ రమేశ్​, అనిల్​ రావిపూడి , బాబీ, మారుతి పర్సనల్​గా కాల్​ చేసి విష్​ చేశారు. చాలా సంతోషమేసింది. మొత్తంగా తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు." అని పరశురామ్​ పేర్కొన్నారు.

ఇక మహేశ్​బాబు సోషల్​మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "సర్కారువారి పాట పట్ల చూపిస్తోన్న అభిమానికి ఎంతో సంతోషిస్తున్నా..! బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందించిన నా సూపర్‌ ఫ్యాన్స్‌ అందరికీ ధన్యవాదాలు. చిత్ర బృందానికి ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు పరశురామ్‌, మాంచి మ్యూజిక్‌ అందించిన తమన్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా నాకెప్పటికీ ప్రత్యేకమే" అని మహేశ్‌ రాసుకొచ్చారు.

ఇదీ చూడండి: సక్సెస్​ ఈవెంట్.. ఆనందంతో స్టేజ్​పై మహేశ్​ చిందులు

ABOUT THE AUTHOR

...view details