తెలంగాణ

telangana

'మెగా 156' - కళ్లుచెదిరేలా టైటిల్​ గ్లింప్స్​ - రిలీజ్ డేట్ ఇదే

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 5:19 PM IST

Updated : Jan 15, 2024, 5:31 PM IST

Chiranjeevi Vasishta Movie Title Glimpse : మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియన్ మూవీ సినిమా టైటిల్ గ్లింప్స్​ అండ్ కాంసెప్ట్​ వీడియోను రిలీజ్​ చేశారు మేకర్స్​. ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది.

'మెగా 156' టైటిల్​ అండ్ కాన్సెప్ట్ గ్లింప్స్​ వచ్చేసిందోచ్​
'మెగా 156' టైటిల్​ అండ్ కాన్సెప్ట్ గ్లింప్స్​ వచ్చేసిందోచ్​

Chiranjeevi Vasishta Movie Title Glimpse : గతేడాది 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి 'భోళాశంకర్' గట్టి దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం చిరంజీవి 'బింబిసార' ఫేమ్ వశిష్టతో కలిసి ఓ సోషియో ఫాంటసీ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను దాదాపు రూ. 200 కోట్లతో తెరకెక్కించబోతున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే సంక్రాంతి పండగ పురస్కరించుకుని సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్​ను అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్​ను ఖారారు చేస్తూ కాన్సెప్ట్​ వీడియో గ్లింప్స్​ను రిలీజ్​ చేశారు. ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. కళ్లు చెదిరే విజువల్స్​తో గ్లింప్స్​ను విడుదల చేశారు. సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

'బింబిసార' వంటి సూపర్‌ హిట్‌ తర్వాత వశిష్ఠ దర్శకత్వంలో రానున్న సినిమా కావడం, అందులోనూ మెగాస్టార్‌ హీరోగా రానున్నడంతో దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ 'మెగాస్టార్‌ స్వచ్ఛమైన ఫాంటసీ జోనర్‌ చిత్రంలో నటించి మూడు దశాబ్దాలు అయిపోయింది. ఈ మూవీ కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి. వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాం. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు" అంటూ చెప్పుకొచ్చారు.

ఇకపోతే సినిమాలో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ మారేడుమిల్లిలో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ సినిమాను నిర్మిస్తోంది. దీనితో పాటు చిరంజీవి తన కుమార్తె సొంత నిర్మాణ సంస్థ 'గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోనూ తన 157వ సినిమాను చేయనున్నారు.

మెగా ఫ్యామిలీ ఫుల్‌ ఫొటో - స్పెషల్ అట్రాక్షన్​గా అకీరా, ఆద్యా

దూసుకుపోతున్న 'హనుమాన్'​ - 'కేజీఎఫ్', 'కాంతారా' కలెక్షన్​ రికార్డ్స్​ బ్రేక్​

Last Updated : Jan 15, 2024, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details