తెలంగాణ

telangana

అది చిరంజీవి అంటే.. తుపాను లెక్కచేయకుండా సముద్రంలో షూటింగ్ చేశారట!

By

Published : Dec 26, 2022, 10:53 AM IST

మెగాస్టార్​ చిరంజీవి ఆ సినిమా కోసం తుపాను సైతం లెక్కచేయకుండా సముద్రంలో షూటింగ్​ చేశారట. ఆ సంగతులు..

Chiranjeevi Valteru veerayya shooting
అది చిరంజీవి అంటే.. ఆ మూవీ కోసం తుపాను లెక్కచేయకుండా సముద్రంలో షూటింగ్!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సినిమాల్లో 'వాల్తేరు వీరయ్య' ఒకటి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించడం కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని దర్శకుడు బాబీ అన్నారు. ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు.

"ఈ సినిమాకు సంబంధించి మనం మరెన్నో సెలబ్రేషన్స్‌ చేసుకోనున్నాం. కథ రాస్తూ, సినిమా తీస్తూ నేను ఈ మాట చెప్పడం లేదు. 'వాల్తేరు వీరయ్య' చూశాకే ఈ స్టేట్‌మెంట్‌ ఇస్తున్నా. 'ఇంద్ర'కు ముందు చిరంజీవి నటించిన రెండు సినిమాలు అంతగా విజయం సాధించలేదు. ఆయన నుంచి బ్లాక్‌బస్టర్‌ వస్తే చూడాలని ఒక మెగా అభిమానిగా నేనూ కసిగా ఎదురుచూశా. అలాంటి సమయంలో నా ఆకలి తీర్చిన చిత్రం ఇంద్ర. అప్పట్లో కాలర్‌ ఎగరేసి తిరిగా. ఆ సినిమా చూడటం కోసం లాఠీ దెబ్బలు కూడా తిన్నా. అలాంటి నాకు మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. చిరంజీవి నుంచి అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్‌ కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకు నిదర్శనమే చిరంజీవి-శ్రీదేవి పాట, ఇప్పటివరకూ వచ్చిన పోస్టర్లు. ఈ సినిమా మెగా అభిమానుల ఆకలి తీరుస్తుందని మాటిస్తున్నా.

చిరంజీవి ఊరికే మెగాస్టార్‌ కాలేదు. పనిపట్ల ఆయన చూపించే నిబద్ధతే అందుకు నిదర్శనం. ఉదయాన్నే సెట్‌లోకి వచ్చేస్తారు. సాయంత్రం వరకూ మాతోనే ఉండి ఎంతో కష్టపడేవారు. మైనస్‌ 8 డిగ్రీల చలిలో చిరంజీవి-శ్రీదేవి పాట షూట్‌ చేశాం. యూనిట్‌ మొత్తం చలికి వణికిపోతుంటే ఆయన మాత్రం ఎంతో యాక్టివ్‌గా షూట్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించి నేనూ ఒక విషయాన్ని లీక్‌ చేస్తున్నా. సినిమా మొదలైనప్పటి నుంచి వీరయ్య ఊసు, ఉనికి వచ్చిన ప్రతిసారీ అభిమానులు తప్పకుండా ఈలలు వేస్తారు. చిరంజీవి కనపడకపోయినా ప్రతి సీన్‌లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన పరిచయ సన్నివేశాలను పెను తుపానులో సముద్రంపై షూట్‌ చేశాం. డూప్‌ లేకుండా సుమారు 10 రోజులపాటు ఇంట్రో సీన్స్‌ షూట్‌లో పాల్గొన్నారు. ఓ వైపు వాన, మరోవైపు అలల తాకిడి.. మేమంతా ఎంతో కంగారుపడ్డాం. ఆయన మాత్రం కూల్‌గా చేసేశారు. ఎవరూ ఆందోళనకు గురికాకండి.. ఈ సారి హిట్‌ కొడుతున్నాం" అని బాబీ చెప్పారు.

వాల్తేరు వీరయ్య

ఇదీ చూడండి:అబ్బో అల్లు అరవింద్​-సుక్కులో ఈ యాంగిల్​ కూడా ఉందా.. యంగ్ బ్యూటీతో కలిసి రచ్చ!

ABOUT THE AUTHOR

...view details