తెలంగాణ

telangana

నటి రోజాకు చిరంజీవి గట్టి కౌంటర్​..

By

Published : Jan 12, 2023, 7:15 PM IST

మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ నటి, ఏపీ మంత్రి రోజా చేసిన విమర్శలపై చిరంజీవి స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

Chiranjeevi comments on Actress Roja
నటి రోజాకు చిరంజీవి గట్టి కౌంటర్​..

మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ నటి, ఏపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై తాను మాట్లాడాలనుకోవడం లేదని.. తాను చేస్తోన్న సేవలకు సీసీటీ, బ్లడ్‌బ్యాంక్‌, ఆక్సిజన్‌ బ్యాంక్.. వంటివి నిలువెత్తు నిదర్శనాలని ఆయన చెప్పారు.

ఈ మేరకు తన తదుపరి చిత్రం వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన రోజా చేసిన విమర్శలపై.. "ఆ సమయానికి ఆమె అలా అనాల్సి వచ్చిందేమో. ఆమె చేసిన వ్యాఖ్యల గురించి నేను ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. నేను ఎలాంటి సేవలు చేశాను, చేస్తున్నాను అనే దానికి సీసీటీ, బ్లడ్‌బ్యాంక్, ఆక్సిజన్‌ బ్యాంక్‌ నిలువెత్తు సమాధానాలు. వాళ్ల వ్యాఖ్యలకు సమాధానం చెప్పడం అనేది నా స్థాయిని నేనే తగ్గించుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడైనా, లేదా ఇప్పుడైనా.. ఎదుటి వారు నాపై ఎలాంటి విమర్శలు చేసినా వాటిపై స్పందించాలనుకోలేదు. ఎందుకంటే వాళ్లు నాతోపాటు నటించారు. భావోద్వేగాలను పంచుకున్నారు. మా ఇంటికి వచ్చారు. మాతో కలిసి భోజనం చేశారు. సొంతవారిలా కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ల నైజం ప్రకారం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందించడం నా నైజం కాదు. వాళ్లు ఏం మాట్లాడినా అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రేమ, వాత్సల్యానికి విలువనిచ్చే మనిషిని నేను. వాళ్లకు కౌంటర్లు విసిరి, వాళ్లను తగ్గించేసి.. నా సెంటిమెంట్‌ను బ్రేక్ చేసుకోలేను. వాళ్లతో అనుబంధాన్ని ఎప్పుడూ పదిలంగానే చూసుకుంటా. ఇంకా ఏం మాట్లాడతారో మాట్లాడనివ్వండి. ప్రేమాభిమానాలకు విలువే లేదా? ఇంతేనా ఈ ప్రపంచం? ఎలాంటి లబ్ధి కోసం, ఎవరి కరుణ పొందాలని వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు? వీళ్లకు పరిణతి ఎప్పుడు వస్తుంది? రాజకీయాలంటే ఇలాగే ఉండాలా? వేరేలా ఉండకూడదా? అని అనిపిస్తుంటుంది" అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:విజయ్​ 'వారిసు'ను అజిత్ 'తునివు' ​బీట్​ చేసిందిగా!

ABOUT THE AUTHOR

...view details