తెలంగాణ

telangana

బాలయ్య జోరు.. ఈ సారి ఆ దర్శకుడితో ప్రయోగాత్మక చిత్రమట​!

By

Published : Nov 9, 2022, 2:00 PM IST

ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన నందమూరి నటసింహం బాలయ్య.. మరో ప్రయోగాత్మక చిత్రానికి ఓకే చెప్పారని తెలిసింది. ఆ వివరాలు..

Balakrishna care of kancherpalem director
చిన్న దర్శకుడితో బాలయ్య ప్రయోగాత్మక చిత్రం

మాస్​ అయినా క్లాస్​ అయినా.. ప్రయోగాత్మక చిత్రాలైనా, పౌరాణిక సినిమాలైనా.. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల్ని అలరించే నటసింహం బాలకృష్ణ. కొత్త వారికి అవకాశాలు ఇవ్వడంలోనూ ముందుంటారు. ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా మరో సినిమాను లైన్​లో పెట్టారని తెలిసింది. అది కూడా ప్రయోగాత్మక చిత్రమట.

కేరాఫ్‌ కంచెరపాలెం సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు వెంకటేశ్‌ మహ ఇటీవల ఓ స్క్రిప్ట్‌ వినిపించారని.. బాలయ్యకు అది బాగా నచ్చిందంటున్నాయి ఫిల్మినగర్‌ వర్గాలు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా అలరించనుందంటున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా గీతా ఆర్ట్స్‌ నిర్మించే అవకాశం ఉందంటున్నారు. ఇక వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు.

అఖండ బ్లాక్‌బస్టర్‌తో జోష్​ మీదున్న బాలయ్య.. ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరసింహారెడ్డి అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత అనిల్​ రావిపూడితోనూ ఓ మూవీ చేయనున్నారు.

ఇదీ చూడండి:Rashmika దాని వల్ల నా మనసు విరిగిపోయింది చాలా ఇబ్బంది పడుతున్నా

ABOUT THE AUTHOR

...view details