తెలంగాణ

telangana

బెడ్​పై లేవలేని స్థితిలో యాంకర్​ లాస్య.. ఏమైంది

By

Published : Sep 3, 2022, 2:25 PM IST

Updated : Sep 3, 2022, 5:13 PM IST

Anchor Lasya hospitalised
ఆస్పత్రిలో యాంకర్ లాస్య

యాంకర్​ లాస్య ఆస్పత్రి పాలైంది. ఆమెకు ఏమైందా అని ఫ్యాన్స్​ కంగారు పడుతున్నారు. అయితే ఆమె ఎందుకు హాస్పిటల్​లో జాయిన్​ అయిందో తెలియలేదు.

బుల్లితెర యాంక‌ర్‌గా లాస్యది ఓ ప్రత్యేకమైన జర్నీ. 'సంథింగ్ స్పెషల్' రూపంలో యాంకరింగ్ చేయడంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అయితే ఆ తర్వాత క్రమంగా బుల్లితెరకు దూరమైన లాస్య తిరిగి కొంతకాలం నుంచి సోషల్​మీడియాలో చురుగ్గా ఉంటోంది. యూట్యూబ్​ ఛానల్​తో ఫ్యాన్స్​ను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు హాస్పిటల్‌ పాలైంది.

ఈ విషయాన్ని స్వయంగా లాస్య భర్త మంజునాథ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చారు. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ ఓ పోస్ట్‌ను షేర్‌ చేశారు. దీంతో యాంకర్‌ లాస్యకు ఏమైందంటూ ఆమె ఫ్యాన్స్‌ కంగారు పడుతున్నారు. లాస్య హాస్పిటల్‌లో ఎందుకు చేరిందన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు.

బెడ్​పై లాస్య

ఇదీ చూడండి: 'బ్ర‌హ్మ‌స్త్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. మేకర్స్​ అన్ని కోట్లు న‌ష్ట‌పోయారా?

Last Updated :Sep 3, 2022, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details