తెలంగాణ

telangana

'ఆదిపురుష్'పై మరో వివాదం.. సెన్సార్ బోర్డును వివరణ కోరిన కోర్టు!

By

Published : Jan 14, 2023, 7:03 AM IST

Updated : Jan 14, 2023, 7:51 AM IST

'ఆదిపురుష్' చిత్రంపై చెలరేగిన వివాదాలు సద్దుమణిగిన తరుణంలో.. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ చిత్రానికి సంబంధించి సెన్సార్ బోర్డు నుంచి సమాధానం కోరింది అలహాబాద్​ హైకోర్టు. అసలేం జరిగిందంటే?

adipurush
pil in allahabad high court on adipurush

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' చిత్రం కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా.. ఫస్ట్ లుక్ విడుదలైన రోజు నుంచి వివాదాల్లో చిక్కుకుందని చెప్పొచ్చు. సినీ ప్రపంచానికి 'తన్హా జీ' వంటి అత్యుత్తమ చిత్రాన్ని అందించిన ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మెగా బడ్జెట్ చిత్రంపై ప్రేక్షకులే కాదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ టీజర్ రిలీజైన తర్వాత రాముడి నుంచి హనుమంతుడి వరకు అందరి లుక్స్ పై వివాదాలు చెలరేగాయి. రావణుడిని చూసిన ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. 'ఆదిపురుష్' చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై రిప్లై ఇవ్వాల్సిందిగా సెన్సార్​ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు పంపించింది. కుల్దీప్ తివారీ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిల్‌పై ఇప్పటికే ఉత్తర్వులు జారీ అవ్వగా ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 21న జరగనుందని లఖ్​నవూ బెంచ్​ తెలిపింది.

సర్టిఫికెట్​ లేకుండా ప్రోమో రిలీజ్​..
సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాకుండానే మూవీ టీమ్​ 'ఆదిపురుష్​' ప్రోమోను రిలీజ్​ చేసిందని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్​ కుల్దీప్​ పేర్కొన్నారు. అంతే కాకుండా సీతా దేవి పాత్రలో నటిస్తున్న కృతి సనన్ వేసుకున్న కాస్ట్యూమ్స్‌పై కూడా కుల్దీప్​ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సీతారాములపై ప్రజల్లో లోతైన విశ్వాసం ఉందని, కానీ ఈ సినిమాలో పాత్రలను ప్రజల విశ్వాసానికి వ్యతిరేకంగా చూపించారని ఆరోపించారు.

సినిమా విడుదల తేదీ వాయిదా
దసరా సందర్భంగా అయోధ్యలో టీజర్‌ను విడుదల చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. దీంతో ఆ నిరసనలు సినిమా విడుదలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని భావించిన మేకర్స్​.. విడుదల తేదీని వాయిదా వేశారు.

Last Updated : Jan 14, 2023, 7:51 AM IST

ABOUT THE AUTHOR

...view details