ప్రముఖ సినీ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ.. రాయచూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పలు దక్షిణాది సినిమాల్లో చలపతి చౌదరి నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన బాలకృష్ణ సినిమా 'అఖండ'లో కూడా కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ, కన్నడలో మొత్తం 100 సినిమాల్లో నటించారు చలపతి. అలాగే పలు సీరియల్స్‌లో ఆయన వివిధ పాత్రలు చేశారు. చలపతి చౌదరి.. విజయవాడకు చెందిన వారు కాగా.. రాయ్‌చూర్‌లో స్థిరపడ్డారు.
ఇదీ చదవండి:NTR Birthday: ఎన్టీఆర్‌తో మామూలుగా ఉండదు.. ఏదైనా రాయల్‌గానే..
Last Updated :May 20, 2022, 2:53 PM IST