తెలంగాణ

telangana

హనుమంతుడికి సీటు.. 1.5 లక్షల ఫ్రీ టికెట్స్​.. 'ఆదిపురుష్'​కు ఇవే బలమా?

By

Published : Jun 15, 2023, 6:05 PM IST

Adipurush Movie: ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆదిపురుష్'​. అయితే కొన్ని లక్షలు విలువ చేసే టికెట్లను కొనుగోలు చేసిన కొందరు ప్రముఖులు వాటిని కొన్ని వర్గాలకు ఉచితంగా పంచనున్నారు. విరాళం ఇవ్వనున్న మొత్తం టికెట్లు ఎన్ని? వాటి విలువ ఎంత? 'ఆదిపురుష్'​కు ఇవే బలమా?

1.5 lakh free tickets, 1 seat dedicated to Lord Hanuman in every theatre, Adipurush Movie promotions
'ఆదిపురుష్‌' ఫ్రీ టికెట్స్​.. సినిమా ప్రమోషన్స్​లో భాగమా..?

Adipurush Movie : 'ఆదిపురుష్‌' ప్రస్తుతం అంతటా మారుమోగుతున్న పేరు. రెబల్​ స్టార్​ ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌ పాన్​ ఇండియా చిత్రమిది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం వరల్డ్​ వైడ్​గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొందరు సినీ, వ్యాపార ప్రముఖులు లక్షల రూపాయలు విలువ చేసే కొన్ని వేల టికెట్లను కొనుగోలు చేశారు. అయితే వీటిని వారు కొంతమందికి ఉచితంగా పంచనున్నారు. ఎవరెవరు ఎన్ని టికెట్లు కొన్నారంటే?

Adipurush Free Tickets : తాము నిర్మించిన సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ కావాలనే ఉద్దేశంతో మూవీ టీమ్స్​ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్​ అప్పుడప్పుడూ ఇలాంటి ట్రిక్స్​ను అమలు చేస్తుంటారు. కొన్ని సార్లు టికెట్ల్​పై ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటారు. సాధారణంగా కొందరు నిర్మాతలు ఒకటి కొంటే మరొక టికెట్​ ఫ్రీగా ఇస్తుంటారు. మరికొందరు కాస్త వైవిధ్యంగా ఆలోచించి తమ సినిమా కంటెంట్​ను బట్టి ఫ్యామిలీ ఎంటర్​టైనరైతే మహిళలకు, పిల్లలను ఆకట్టుకునే విధంగా ఉండే సినిమా ఐతే చిన్నారులకు టికెట్లపై ఆఫర్లు ఇస్తుంటారు. సినిమాలో భాగం ఉన్న వారు చేసే ఈ పని సాధారణ విషయమే అయినా.. సినిమాతో ఏ మాత్రం సంబంధం లేని వారు కూడా ఈ రకమైన ఆఫర్లు ప్రకటిస్తే కాస్త స్పెషలే కదూ. ఇందుకు వేదికైంది పౌరాణిక బ్యాక్​డ్రాప్​లో రూపొందిన చిత్రం 'ఆదిపురుష్​'.

అనాథలు, వృద్ధుల కోసం పదివేల టికెట్లు!
Adipurush Abhishek Agarwal : మహాకావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి.. రాముడి గురించి ఈతరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన 10 వేలకుపైగా టికెట్లను కొని తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో ఉండే వారికి ఫ్రీగా పంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

పేద చిన్నారుల కోసం..
Adipurush Ranbeer Kapoor : బాలీవుడ్‌ ప్రముఖ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, సింగర్‌ అనన్య బిర్లా కూడా తమ వంతుగా ఒక్కొక్కరు 10 వేల టికెట్లను బుక్‌ చేసి పేద చిన్నారులకు అందిస్తున్నారు.

'మంచు' మనసు..
Adipurush Manchu Manoj : టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ దంపతులు​ సైతం ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాల్లో ఉంటున్న 2500 చిన్నారులకు ఈ సినిమాను ఉచితంగా చూపించనున్నట్టు తెలిపారు.

ప్రతి రామాలయానికి 101 టికెట్లు!
Adipurush Shreyas Media : ప్రముఖ ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌ సంస్థ శ్రేయస్‌ మీడియా అధినేత శ్రేయస్‌ శ్రీనివాస్​ కూడా కాస్త వినూత్నంగా ఆలోచించారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్న రామాలయానికి 101 టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నుట్టు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. అయితే జిల్లా వ్యాప్తంగా చాలానే రామాలయాలు ఉన్నాయి. ఇందుకోసం మొత్తం 1,32,500లకిపైగా 'ఆదిపురుష్‌' టికెట్లను ఫ్రీగా ఇవ్వనున్నారట.

1.5 లక్షల ఫ్రీ టికెట్లు!
Adipurush Free Tickets : అయితే సుమారు 1.5 లక్షల 'ఆదిపురుష్' టిక్కెట్లను కేవలం విరాళం రూపంలోనే అందించనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. వీటి విలువ రూ.3 నుంచి రూ.3.5 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.

ప్రతి థియేటర్​లో హనుమంతుడికి సీట్​!
Adipurush Hanuman Seat : రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకంతో 'ఆదిపురుష్‌' టీమ్‌ ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటును హనుమంతుడి కోసం అదనంగా కేటాయించింది.

నో ప్రమోషన్స్​.. కారణం అదేనా?
Adipurush Promotions : అయితే ఆదిపురుష్​ మూవీ టీమ్​.. ప్రచార పర్వానికి దూరంగా ఉంది. ఒక్క ఇంటర్వ్యూ, ప్రెస్​ మీట్​ గానీ పెట్టలేదు. అయితే ఈ టికెట్ల విరాళ కార్యక్రమం.. సినిమాకు ప్రచారంగా పనిచేస్తుందని అంటున్నారు సినిమా క్రిటిక్స్​. మరి ఈ సందడి 'ఆదిపురుష్​'కు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది వేచి చూడాలి.

"ఆదిపురుష్' చిత్ర బృందం సంప్రదాయ పద్ధతైన ప్రచారాలకు దూరంగా ఉంది. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా ప్రమోషన్స్​ సమయంలో మరిన్ని వివాదాలకు తావివ్వకుండా మేకర్స్​ జాగ్రత్త పడుతున్నట్లు ఉన్నారు​. అందుకే వారు సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ ఉచిత టిక్కెట్ల పంపిణీ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారనుకుంటాను. ఇది సినిమాపై కచ్చితంగా అనుకూలమైన ప్రభావాన్ని చూపనుంది" అని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖ ట్రేడ్​ ఎనలిస్ట్ రమేశ్​ బాలా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details