తెలంగాణ

telangana

Love Fraud: ప్రేమ పేరుతో నగ్న చిత్రాలు సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు

By

Published : Aug 22, 2021, 9:58 AM IST

ప్రేమ పేరుతో నమ్మించి, యువతిని మోసం చేసిన ఘటన విజయవాడలో జరిగింది. కలిసి ఉన్నప్పుడు తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని యువతిని బెదిరించాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

love
ప్రేమ

చదువుకునేందుకు బిహార్‌ నుంచి వచ్చాడు. ఏపీ విజయవాడలోని ఒక ప్రముఖ కళాశాలలో డిగ్రీ చదువుతూ ప్రేమిస్తున్నానంటూ నగరానికి చెందిన ఒక యువతి వెంటపడ్డాడు. ఆమెతో మాటలు కలిపాడు. నమ్మించి నగ్న చిత్రాలు, వీడియోలు సంపాదించాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అతనిని దూరం పెట్టింది. జీర్ణించుకోలేకపోయిన యువకుడు ఆమె నుంచి సేకరించిన నగ్న చిత్రాలు, వీడియోలను స్నేహితుడి సాయంతో యువతి పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా తెరిచి పెట్టాడు. పలు సామాజిక మాధ్యమాల్లోనూ వాటిని పోస్ట్‌ చేశాడు. ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు బిహార్‌కు చెందిన రోహిత్‌కుమార్‌, కృష్ణలంకకు చెందిన దండగల గణేష్‌ను అరెస్టు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఏ సెల్‌ఫోన్‌తో నకిలీ ఖాతా సృష్టించారో గుర్తించారు. కృష్ణలంకకు చెందిన గణేష్‌ను అదుపులోకి తీసుకోవడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వారి వద్ద నుంచి నకిలీ ఖాతా సృష్టించేందుకు వినియోగించిన సెల్‌ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌ విధించారు.

ఇదీచదవండి. Bus Accident: అక్కాతమ్ముళ్లను కబళించిన బస్సు.. సోదరి అక్కడికక్కడే మృతి

ABOUT THE AUTHOR

...view details