తెలంగాణ

telangana

మాట్లాడదామని పిలిచి.. కళ్లలో కారం కొట్టి.. రోకలిబండతో బాది.. భర్తను చంపిన భార్య

By

Published : Mar 27, 2022, 12:13 PM IST

Updated : Mar 27, 2022, 5:30 PM IST

Wife Killed Husband: వారిద్దరు భార్యాభర్తలు.. అయినా వేర్వేరుగా ఉంటున్నారు. ఏమైందో తెలియదు.. తానుంటున్న ఇంటి ముందు నుంచి వెళ్తున్న భర్తను మాట్లాడదామని పిలిచింది. ఆగిన భర్త కంట్లో కారం కొట్టింది. పారిపోతుంటే రోకలిబండతో కొట్టింది. ఇంకేముంది.. తాను అనుకున్నట్టే భర్త చచ్చిపోయాడు.

wife killed husband in thadicherla for family conflicts
wife killed husband in thadicherla for family conflicts

Wife Killed Husband: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో దారుణం చోటుచేసుకుంది. భార్యే భర్తను చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాచర్ల రాజయ్య, రాజక్క దంపతులు. కల్లు అమ్ముకుంటూ జీవనంసాగించే వారి మధ్య గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. కాగా.. కొన్ని రోజులుగా ఇద్దరు వేర్వేరుగా నివాసముంటున్నారు. వీళ్లకు వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా.. ఒక కూతురు చనిపోయింది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా.. అందులో ఒకరు భర్తను వదిలేసి తల్లితోనే ఉంటోంది.

కుటుంబ కలహాలతో విసిగిపోయిన రాజక్క.. ఎలాగైనా రాజయ్యను హతమార్చాలని నిశ్చయించుకుంది. ఈరోజు(మార్చి 27) వేకువజామున తాను ఉంటున్న ఇంటి ముందు నుంచి వెళ్తున్న రాజయ్యను గమనించింది. మాట్లాడదామని ఇంటికి పిలిచింది. నమ్మిన రాజయ్య ఆగటంతో.. ఒక్కసారిగా కంట్లో కారం కొట్టింది. తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలోనే రోకలిబండతో.. తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ రాజయ్య అక్కడే ఉన్న మురుగు కాలువలో పడిపోయి ప్రాణాలు విడిచాడు.

ఉదయం పూట మురుగుకాలువలో విగతజీవిగా పడి ఉన్న రాజయ్యను చూసి.. స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విచారించగా అసలు విషయం తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. రాజయ్య హత్య వెనుక రాజక్క మాత్రమే ఉందా..? ఇంకా ఎవరైనా ఉన్నారా..? అన్న కోణంలో విచారిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం రాజయ్య మృతదేహాన్ని మహదేవ్​పూర్​ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:Bus accident: నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. చిన్నారితో సహా ఎనిమిది మంది మృతి

Last Updated : Mar 27, 2022, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details