తెలంగాణ

telangana

సామాజిక మాధ్యమాల్లో పిల్లల అశ్లీల చిత్రాలు.. రెండు రోజుల్లో 4 కేసులు

By

Published : Oct 15, 2022, 1:42 PM IST

చిన్న పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లోకి అప్‌లోడ్‌ చేస్తున్న వారిపై ఏపీ విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు రెండు రోజుల్లో నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ నిందితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు.

Vijayawada Cyber Crime Police
Vijayawada Cyber Crime Police

చిన్న పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లోకి అప్‌లోడ్‌ చేస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్ విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు రెండు రోజుల్లో నాలుగు కేసులు నమోదు చేశారు. విజయవాడ నుంచి ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, జీ మెయిల్‌ ద్వారా పిల్లల అశ్లీల చిత్రాలను అప్‌లోడ్‌ చేస్తున్నట్లు సీఐడీ విభాగం ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులు నమోదయ్యాయి.

ఒక కేసులో 12 మంది నిందితులుండగా వారిలో ముగ్గురు మహిళలు ఉండటం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల అశ్లీల చిత్రాలు, వీడియోలు అప్‌లోడ్‌ చేయటం తీవ్రమైన నేరం. దీనిపై నిరంతరం పోలీసు నిఘా ఉంటుంది. ఎవరైనా అప్‌లోడ్‌ చేస్తే.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వెంటనే గుర్తిస్తారు. సీఐడీ విభాగం ఇలాంటి వారి వివరాలను గుర్తించి, స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తుంది.

ఈమేరకు విజయవాడ నగరానికి చెందిన కొంతమంది అశ్లీల చిత్రాలు అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించి సీఐడీ పోలీసులు సమాచారం అందించారు. ఈ మేరకు.. విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు రంగంలోకి దిగి ఒక కేసులో ముగ్గురు మహిళలు సహా 12 మందిపై కేసు నమోదు చేశారు. నిందితులు షేక్‌ షెహనాజ్‌, తెంటు బ్రహ్మానందరావు, గుడివాడ వెంకట మణికంఠ శ్రీపాండు రంగ, చక్కా కిరణ్‌కుమార్‌ రామకృష్ణ, ఎస్‌.కె.నాగుల్‌ మీరావలి, రవి యర్రభనేని, రవి అంజయ్య, కట్టా సాయికృష్ణ, పాల్వంచ తిరుమల లక్ష్మీనరసింహాచార్యులు, ఎస్‌.కె.అంజలి, పులిపాటి భావన, దాసి సరళలపై ఒక కేసు నమోదు చేశారు. అలాగే వెనుటూరుమిల్లి అజయ్‌కుమార్‌, కమలేష్‌ కుమార్‌ చౌదరిలపై మరో కేసు నమోదు చేశారు. మిగిలిన రెండు కేసుల్లో నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:తెలంగాణలో పీఎఫ్ఐ కుట్ర!.. ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం

మైనర్​ కిడ్నాప్​కు విఫలయత్నం, కరెంట్​ స్తంభానికి కట్టి చితకబాదిన గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details