తెలంగాణ

telangana

Bride Death Case: పెళ్లి ఆపాలనుకుంది... కానీ ప్రాణమే పోయింది...

By

Published : May 23, 2022, 10:41 AM IST

Bride Death Case : ఏపీ వైజాగ్​లో పెళ్లిపీటలపై కుప్పకూలి చనిపోయిన వధువు కేసులో మిస్టరీ వీడింది. ప్రేమ వ్యవహారం కారణంగా పెళ్లిని ఆపే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు.

bride groom death
bride groom death

Bride Death Case: ఏపీ విశాఖ మధురవాడకు చెందిన వధువు సృజన మృతి కేసులో చిక్కుముడి వీడింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. పెళ్లి అపాలనుకునే ప్రయత్నంలో వధువు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు నిర్ధారించారు.

కాల్ డయల్ రికార్డర్‌తో నిజాలు వెలుగు చూసినట్లు తెలిపారు. పెళ్లికి 3 రోజుల ముందు ప్రియుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో ఛాటింగ్‌ చేసినట్లు గుర్తించారు. పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే వ్యక్తితో ఏడేళ్లుగా ప్రేమలో ఉంది. సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి నిరాకరిస్తూ వచ్చిన మోహన్‌.. కొంత సమయం నిరీక్షించాలని సృజనకు చెప్పాడు.

ఈ క్రమంలో పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి సృజన హామీ ఇచ్చింది. అయితే.. ఊహించని విధంగా మృతి చెందింది. విష పదార్థం తీసుకోవడంతో పెళ్లి రోజు సృజనకు ఆరోగ్యం క్షీణించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

ABOUT THE AUTHOR

...view details