తెలంగాణ

telangana

బెల్లంపల్లిలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

By

Published : Mar 23, 2021, 2:03 PM IST

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

two died in bellampally
బెల్లంపల్లిలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం చేస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. పట్టణంలోని కన్నాల బస్తీలో గృహ నిర్మాణం చేసే సమయంలో ప్రమాదవశాత్తు జరిగిన విద్యుదాఘాతంతో ఇంటి యజమాని, కూలీ మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.

11 కేవీ విద్యుత్ లైన్​పై ఇనుప పైపులు పడటంతో సమీపంలో ఇంటి యజమాని సముద్రం, కూలీ వెంకటేష్​ అక్కడే ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన మల్లేష్​ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించారు.

ఇదీ చదవండి:వ్యక్తి అనుమానాస్పద మృతి.. భార్య, మేనల్లుడిపై అనుమానం

ABOUT THE AUTHOR

...view details