తెలంగాణ

telangana

వ్యాను డోరు తెరుచుకోవడంతో... జారిపడి ఇద్దరి మృతి

By

Published : Feb 24, 2021, 11:51 AM IST

వ్యాను వెనుక డోరు తెరుచుకోవడంతో ఆకస్మాత్తుగా జారిపడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన ఏపీ పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

accident
వ్యాను డోరు తెరుచుకోవడంతో... జారిపడి ఇద్దరి మృతి

ఆంధ్రప్రదేశ్​ పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం అర్జాపురం నుంచి గుడివాడ వెళ్తున్న బొలెరో వాహనం వెనక డోర్ లింకులు తెగిపోవడంతో డోరు తెరుచుకుంది.

దీంతో రాజాన తాతలు, యర్రంశెట్టి నూకరాజు వాహనం నుంచి కింద పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరంతా గుడివాడ సమీపంలోని మినప చేన్లకి కూలి పనులకు వెళ్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి.యూపీలో ఘోర ప్రమాదం: ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details