తెలంగాణ

telangana

Trainee IAS Sexual Harassment Case: ట్రైనీ ఐఏఎస్​పై లైంగిక దాడి కేసు

By

Published : Oct 21, 2021, 4:59 PM IST

Updated : Oct 21, 2021, 8:56 PM IST

Trainee IAS

16:58 October 21

కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు

కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు

వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ కుమారుడు, ట్రైనీ ఐఏఎస్ మృగేందర్‌ లాల్​(Trainee IAS sexual harassment case)పై ఓ యువతి కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ముఖం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ప్రస్తుతం మృగేందర్‌ తమిళనాడు మధురైలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారిగా పనిచేస్తున్నారు. గత నెల 29న కేసు నమోదు కాగా... ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.  

ఫేస్​బుక్​లో పరిచయం...

ట్రైనీ ఐఏఎస్‌ మృగేందర్‌లాల్‌ (Trainee IAS sexual harassment case) ఫేస్​బుక్‌లో బంధువంటూ పరిచయం పెంచుకున్న మృగేందర్‌... యువతికి దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో యువతితో తరచు చాటింగ్‌ కొనసాగించాడు. హైదరాబాద్‌లో అతనితో కలిసి స్నేహితుల జన్మదినోత్సవాలకు కూడా యువతి హాజరయ్యారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగగా... మృగేందర్‌ ఆమెను పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.

నమ్మించి లొంగదీసుకుని...  

యువతి కుటుంబసభ్యులను కూడా మృగేందర్‌ కలిశాడు. 2019లో అతను ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. జాతీయ పోలీసు శిక్షణ సంస్థలో ట్రైనీగా ఉన్న సమయంలో యువతిని శిక్షణ సంస్థలోని తన గదికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో తనపై అసభ్యంగా ప్రవర్తించాడని... దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత క్షమాపణ చెప్పి వివాహం చేసుకోబోతున్నానని నమ్మించి లొంగదీసుకున్నాడని తెలిపారు.  

ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసి...  

ఆ తర్వాత యువతి వివాహం ప్రస్తావన తీసుకురాగా దాటవేస్తూ వచ్చారు. ఈ క్రమంలో మృగేందర్‌ తండ్రి మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ (Ex Mla Madanlal) యువతిని బెదిరింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించారు. మృగేందర్‌ మేనమామ యువతి ఇంటికి వచ్చి చంపుతానంటూ బెదిరించాడని ఆమె పోలీసులకు వివరించారు. యువతి వద్ద ఉన్న చరవాణి లాక్కుని అందులో మృగేందర్‌తో ఉన్న ఫొటోలు, వీడియోలు డిలీట్‌ చేసినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపారు. తిరిగి అతనితో ఎన్నిసార్లు మాట్లాడాలని బాధితురాలు ప్రయత్నించినా... అందుబాటులోకి రాకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.  

గోప్యంగా...  

గత నెల 29న పోలీసులకు ఫిర్యాదు రాగా విషయం బయటపడకుండా గోప్యంగా ఉంచారు. కాగా మృగేందర్‌లాల్‌ 2019లో ఐపీఎస్‌ మహారాష్ట్ర క్యాడర్‌కు ఎంపికయ్యాడు. అనంతరం 2020లో ఐఏఎస్‌ తమిళనాడు క్యాడర్‌కు ఎంపికయ్యాడు.  

ఇదీ చూడండి:Rape of 4 year old Girl : చాక్లెట్ ఆశచూపి దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

                      sexual harrasements: అత్యాచారాలకు పాల్పడుతున్నవారిలో అత్యధికులు వారే !

Last Updated :Oct 21, 2021, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details