తెలంగాణ

telangana

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

By

Published : May 5, 2021, 2:55 PM IST

ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను జైపూర్ పోలీసులు సీజ్ చేశారు. ఇసుక తరలించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ట్రాక్టర్లను పట్టుకున్నారు. అనుమతులు లేకుండా తరలిస్తున్న నలుగురు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

tractors Seize  transport sand illegally, tractors seized
అక్రమ ఇసుక రవాణా, ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లు సీజ్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేలాల గ్రామ శివారులో గోదావరి నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాపై వచ్చిన సమాచారంతో ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.

ఇసుకను తరలించేందుకు సిద్ధంగా ఉన్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. నలుగురు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఏఎస్సై అజీజ్, కానిస్టేబుల్ సుబ్బారావు, హోంగార్డు మోసిన్​లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన కారు.. వృద్ధుడు మృతి

ABOUT THE AUTHOR

...view details