తెలంగాణ

telangana

Land dispute: ఇరువర్గాల ఘర్షణ.. ముగ్గురికి తీవ్రగాయాలు!

By

Published : Jun 20, 2021, 9:24 AM IST

భూ పంచాయితీ చిలికి చిలికి గాలివానలా మారింది. ఇరువర్గాల ఘర్షణకు దారి తీసింది. కొడవళ్లతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. ఈ ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇరువర్గాల ఘర్షణ.. ముగ్గురికి తీవ్రగాయాలు!
ఇరువర్గాల ఘర్షణ.. ముగ్గురికి తీవ్రగాయాలు!

నాగర్​కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండలం కొండూరు గ్రామ శివారులోని మొగలిపురం సమీపంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భూ వివాదం కారణంగా ఇరు వర్గాలు కొడవళ్లతో దాడి చేసుకున్నాయి. ఘర్షణలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

బాధితులు తమ పొలాన్ని చదును చేసుకుంటుండగా.. వారి బంధువులే అయిన మరో వర్గంవారు వీరిపై దాడికి పాల్పడ్డారు. కళ్లలో కారం చల్లి.. కొడవళ్లతో దాడి చేశారు. ఘర్షణలో రాముడు, రాంమూర్తి, కురుమయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే క్షతగాత్రులను కొల్లాపూర్​ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్​నగర్​ ఆసుపత్రికి తరలించారు.

గత 70 ఏళ్లుగా ఆ పొలాన్ని తామే సాగు చేసుకుంటున్నామని.. ఇప్పుడు తమ బంధువులు వచ్చి ఆ భూమి మాదంటూ దౌర్జన్యంగా దాడులకు పాల్పడ్డారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. తమకు తెలియకుండానే భూమి పట్టా చేయించుకున్నారన్నారు. 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న మా భూమిని అధికారులు వారి పేరు మీద ఎలా పట్టా చేస్తారంటూ వాపోయారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే కోర్టుకు వెళ్లాలి కానీ దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఫోన్‌ వాడొద్దు బిడ్డా అన్నందుకు... బాలిక ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details