తెలంగాణ

telangana

ఈతకు వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

By

Published : Mar 1, 2022, 7:01 PM IST

missing in Gundlakamma river: ఏపీలోని గుంటూరు జిల్లా ఐనవోలు వద్ద గుండ్లకమ్మ నదిలోని మూడు మృతదేహాలను వెలికి తీశారు. మరణించిన వారంతా ఆయేషా సిద్ధికా(19) విజయవాడ, హీనా (22)వినుకొండ, ఫీజుల్లా ఖాన్ (19) నర్సారావుపేటకు చెందిన వారిగా గుర్తించారు.

missing in Gundlakamma
missing in Gundlakamma

missing in Gundlakamma river: ఏపీ గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు వద్ద గల గుండ్లకమ్మ నదిలో.. ఈతకోసం దిగి గల్లంతైన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు వెలికితీశారు. వీరిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఒకే కుటుంబానికి చెందిన వీరంతా.. వినుకొండలో ఓ శుభకార్యానికి వచ్చి సరదాగా ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యారు. మరణించిన వారంతా ఆయేషా సిద్ధికా(19) విజయవాడ, హీనా (22)వినుకొండ, ఫీజుల్లా ఖాన్ (19) నర్సారావుపేటకు చెందిన వారిగా గుర్తించారు. ఒకేసారి ముగ్గురు మృతిచెందటంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీచూడండి:శివరాత్రి రోజే ఘోరం.. యాక్సిడెంట్​లో ఆరుగురు భక్తులు మృతి

ABOUT THE AUTHOR

...view details