తెలంగాణ

telangana

మహిళ మృతదేహాన్ని బావిలో పడేశారు.. తిరిగి వస్తూ పోలీసులకు చిక్కారు!

By

Published : Jun 20, 2021, 3:48 PM IST

ఓ మహిళ మృతదేహాన్ని బావిలో పడేసి వస్తున్న ఇద్దరు వ్యక్తులను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అటవీలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడాన్ని గమనించిన అటవీ సిబ్బంది.. వారిని ఆపి ప్రశ్నించారు. అసలు విషయం చెప్పడంతో అటవీ సిబ్బంది నివ్వెరపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ చేస్తున్నారు.

మహిళ మృతదేహాన్ని బావిలో పడేశారు.. తిరిగి వస్తూ పోలీసులకు చిక్కారు!
మహిళ మృతదేహాన్ని బావిలో పడేశారు.. తిరిగి వస్తూ పోలీసులకు చిక్కారు!

ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అటవీ సమీప ప్రాంతంలోని ఓ వ్యవసాయ బావిలో మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. ఏ. రంగంపేట అటవీశాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు తిరుగుతూ ఉండటం గమనించి ప్రశ్నించారు. వెంటనే భయపడిన సదరు వ్యక్తులు బాషా, మహేశ్​.. మల్లేశ్వరి అనే మహిళను బావిలో పడేసి వస్తున్నట్లు అటవీ సిబ్బందికి తెలిపారు.

వెంటనే... అటవీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బావిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను హత్య చేయడానికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న చంద్రగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. ప్రియురాలిపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details