తెలంగాణ

telangana

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ.. థియేటర్‌ వద్ద గన్‌తో యువకుడి హల్‌చల్‌

By

Published : Mar 25, 2022, 4:46 PM IST

RRR movie: ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ఆర్ఆర్​ఆర్ సినిమా థియేటర్‌ వద్ద గన్‌తో యువకుడు హల్‌చల్‌ చేశాడు. గన్‌తో తెర ముందు కేరింతలు కొట్టడంతో... ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

young man hulchal with a gun at the RRR movie theater in east godavari district
ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ.. థియేటర్‌ వద్ద గన్‌తో యువకుడి హల్‌చల్‌

RRR movie: ఏపీ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని అన్నపూర్ణ థియేటర్‌ వద్ద ఓ యువకుడు తుపాకీతో హల్‌చల్‌ చేశాడు. గన్‌తో ఫొటోలకు ఫోజులిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రదర్శితమవుతుండగా.. ఆ యువకుడు తెర ముందు గన్‌తో కేరింతలు కొడుతూ అటూ ఇటూ తిరిగాడు. అతడి తీరుతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనంతరం యువకుడు థియేటర్‌ బయట గన్‌తో తిరుగుతుండగా పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు.

అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. అయితే విచారణలో అది డమ్మీ తుపాకీగా తేల్చారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్​ఆర్​ఆర్ మూవీ.. అభిమానులను విశేషంగా అలరిస్తోంది.

థియేటర్‌ వద్ద గన్‌తో యువకుడి హల్‌చల్‌

ABOUT THE AUTHOR

...view details