తెలంగాణ

telangana

'ఆన్​లైన్​ బెట్టింగ్​'తో రూ.10 లక్షల అప్పులు.. తీర్చేందుకు బ్యాంకుకు కన్నం.. చివరకు..!

By

Published : Jan 8, 2023, 3:52 PM IST

ఆన్​లైన్​ బెట్టింగ్​కు అలవాటు పడి ఓ యువకుడు రూ.10 లక్షలు అప్పు చేశాడు. బ్యాంకు​కు కన్నం వేసి ఆ అప్పు తీర్చాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మూడు రోజుల పాటు రాత్రి సమయంలో బ్యాంకుకు వెళ్లి మేనేజర్ గది వెనకాల కిటికీ ఊచలను కోస్తూ వచ్చాడు. అలా దొంగిలించిన సామగ్రిని అమ్మే ప్రయత్నంలో పోలీసులకు దొరికి ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో జరిగింది.

Thief Arrest
Thief Arrest

ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఈ నెల 2న దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బ్యాంకులో మేనేజర్ గదికి ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి.. బ్యాంక్​లో ఉన్న 2 కంప్యూటర్లు, ఒక స్కానర్, ఒక సీసీ టీవీ మానిటర్, క్యాష్ కౌంటింగ్ మిషన్ తదితర వస్తువులను బాల మురళి అనే యువకుడు దోచుకెళ్లాడు.

బ్యాంక్ మేనేజర్ ఈశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడుని గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి.. చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మలమడుగు సీఐ సదాశివయ్య తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details