తెలంగాణ

telangana

ప్రేమించుకుని వెళ్లిపోయారు.. ఆ తర్వాత..?

By

Published : Apr 21, 2021, 9:30 AM IST

Updated : Apr 21, 2021, 2:18 PM IST

కొడుకు ప్రేమించిన పాపానికి ఓ తండ్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కుమారుడు ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయాడు. కాని ఇంటి వద్ద ఉన్న తండ్రి యువతి తరుఫు వారి చేతిలో గాయపడి మరణించాడు. ఈ ఘటన నల్గొండి జిల్లా వర్కాల గ్రామంలో జరిగింది.

love
దాడి

ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కారణంతో జరిగిన దాడిలో యువకుడి తండ్రి మృతిచెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేవదానం, జ్యోతి దంపతుల కుమారుడు శ్రీకాంత్ (20), అదే గ్రామానికి చెందిన యువతి(19) గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 19న శ్రీకాంత్, యువతి గ్రామం నుంచి వెళ్లిపోయారు.

ఈ క్రమంలో పరువు పోయిందనే కారణంతో యువతి తండ్రితో పాటు కుటుంబ సభ్యులు.. శ్రీకాంత్‌ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో అతడి తండ్రి దేవదానం ఇంట్లోనే మృతి చెందారు. యువతి బంధువులు దేవదానంపై దాడి చేయడంతోనే మరణించాడని శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న నాంపల్లి సీఐ శ్రీనివాసరెడ్డి, చింతపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన శ్రీకాంత్, యువతి జరిగిన విషయం తెలుసుకొని చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు సమాచారం.

దాడి

ఇదీ చదవండి:ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య

Last Updated :Apr 21, 2021, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details