తెలంగాణ

telangana

కట్టెల పొయ్యిలో పడిన చిన్నారి... చికిత్స పొందుతూ మృతి

By

Published : May 10, 2021, 1:34 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా బోడేపల్లిలో ప్రమాదవశాత్తు కట్టెల పొయ్యిలో పడి తీవ్రగాయాలపాలైన చిన్నారి మృతి చెందింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచింది. కూతురి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.

కట్టెల పొయ్యిలో పడిన చిన్నారి మృతి
కట్టెల పొయ్యిలో పడిన చిన్నారి మృతి

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ మండలం బోడేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గత నెలలో ప్రమాదవశాత్తు పొయ్యిలో పడిన చిన్నారి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.

కాగజ్​నగర్ మండలంలోని బోడేపల్లి గ్రామానికి చెందిన దంపతులు అశోక్​-సునీతల పెద్ద కూతురు అభినయ(5) గత నెల 29న ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కట్టెల పొయ్యిలో పడిపోయింది. తీవ్రగాయాలైన బాలికను హైదరాబాద్​లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

పది రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన బాలిక.. ఆదివారం మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామ సర్పంచ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. ధైర్యం చెప్పారు. మృతురాలి తండ్రి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్గాం ఎస్సై సందీప్​కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి.. మూడేళ్ల ప్రేమ... పెళ్లనగానే ముఖం చాటేసిన ప్రజా ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details