తెలంగాణ

telangana

అత్యాచారం చేసి చంపేశారు..! పాలమూరులో వెలుగుచూసిన అకృత్యం..

By

Published : Dec 3, 2022, 3:10 PM IST

Updated : Dec 3, 2022, 7:41 PM IST

Tenth Class Girl death in Mahabubnagar district: మహబూబ్ నగర్ జిల్లాలో మరో కీచకపర్వం వెలుగుచూసింది. పదో తరగతి చదువుతున్న విద్యార్ధినిని అత్యాచారం చేసి హత్య చేశారంటూ.. స్థానికులు ఆందోళనకు దిగారు. బాలనగర్ మండలంలో జరిగిన ఈ ఘటనలో మృతురాలి కుటుంబసభ్యులు, స్థానికులు జడ్చర్ల నడిరోడ్డుపై బాలిక మృతదేహంతో బైఠాయించి ధర్నా చేపట్టారు.

పదో తరగతి బాలిక అనుమానాస్పద మృతి
పదో తరగతి బాలిక అనుమానాస్పద మృతి

Tenth Class Girl death in Mahabubnagar district: మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలంలో పదో తరగతి విద్యార్ధిని అనుమాదాస్పద మృతి ఉద్రిక్తతకు దారితీసింది. పదోతరగతి చదువుతున్న గిరిజన విద్యార్ధిణి నిన్న రాత్రి ఒంటరిగా ఉండగా ముగ్గురు నిందితులు ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేశారని, చేసిన ఘాతుకం బైటపడుతుందని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బాలిక మృతి పట్ల ఆగ్రహానికి గురైన బంధువులు సమీప గ్రామంలో నిందితునిలో ఒకరిగా భావిస్తున్న వ్యక్తి కారు, ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు. ఇంటిని ధ్వంసం చేశారు. బాలికకు న్యాయం చేయాలంటే ఇంటి ముందు ధర్నాకు దిగారు. వరుసకు బాబాయి అయినా.. వేరొక వ్యక్తితో కలిసి ఇద్దరూ.. ఈ ఘాతుకానికి ఒడి గట్టారని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో తనతోనూ అసభ్యంగా ప్రవర్తించాడని, నిత్యం తనపై, తన చెల్లెలిపై కన్నేసి ఉంచేవాడని బాలిక సోదరి చెప్పింది.

అతనే తన చెల్లెల్ని చంపేశాడని కన్నీటి పర్యంతమైంది. బాలిక మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి బాధితురాలి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. నిందితులెవరైనా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.

బాలిక మృతి పట్ల కుటుంబీకులు జడ్చర్ల నడిరోడ్డుపై మృతదేహంతో బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో కొన్ని గంటల పాటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనాస్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ వెంకటేశ్వరులు ఆందోళన విరమించాలని కుటుంబీకులను కోరారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని బాధితురాలి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.

మహబూబ్ నగర్​లో పదో తరగతి బాలిక అనుమానాస్పద మృతి

ఇవీ చదవండి:

Last Updated : Dec 3, 2022, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details