తెలంగాణ

telangana

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత

By

Published : Oct 30, 2021, 12:40 PM IST

Updated : Oct 30, 2021, 1:08 PM IST

-secunderabad-railway-station-in-hyderabad
-secunderabad-railway-station-in-hyderabad

12:38 October 30

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి సాగు, అక్రమ (Ganja Smuggling) రవాణా వ్యాపారం హద్దూ అదుపూ లేకుండా సాగుతోంది. రోడ్డు, రైలు, సముద్ర మార్గాల్లో రవాణా (Ganja Smuggling)  అవుతున్న గంజాయి... నిత్యం ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీ మొత్తంలో గంజాయి ఇవాళ పట్టుబడింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 54 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో... రైల్వే పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 54 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి ఒడిశా, ముంబయికి తరలిస్తున్నట్లు గుర్తించినట్లు వివరించారు. 

ఇదీ చదవండి:Suicide: హాస్టల్ నిర్వాహకుడి ఆత్మహత్య.. సూసైడో నోట్​లో ఏముందంటే...

Last Updated : Oct 30, 2021, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details