తెలంగాణ

telangana

Gold smuggling in hyderabad airport: ఎయిర్​పోర్టులో గోల్డ్ సీజ్.. జ్యూసర్ కడ్డీల్లో అమర్చి..!

By

Published : Nov 14, 2021, 2:12 PM IST

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుబడింది(gold smuggling in hyderabad airport). రూ.34 లక్షలు విలువచేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం(gold seized in shamshabad airport) చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో... బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Gold smuggling in hyderabad airport, gold seized in hyderabad
ఎయిర్​పోర్టులో గోల్డ్ సీజ్, విమానాశ్రయంలో బంగారం పట్టివేత

అక్రమ బంగారం సరఫరాకు(Gold smuggling in hyderabad airport) శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారుతోంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రాష్ట్రంలోకి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టులో లక్షల రూపాయలు విలువ చేసే బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడి నుంచి రూ.34లక్షలు విలువచేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్​కు ఈ బంగారాన్ని తరలిస్తుండగా సీజ్ చేశామని అధికారులు తెలిపారు.

జ్యూసర్ కడ్డీల రూపంలో..

ఎయిర్​పోర్టులో ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో... బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జ్యూసర్‌లో కడ్డీల రూపంలో బంగారాన్ని అమర్చి.. తీసుకెళ్లడానికి యత్నించాడని అధికారులు తెలిపారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

రైల్లో కూడా అక్రమంగా..

ఇప్పటి వరకు విమానాశ్రయాల్లోనే ఎక్కువగా అక్రమ బంగారం పట్టుబడుతోంది. కానీ, స్మగ్లర్లు రైళ్లలో కూడా బంగారం తరలిస్తున్నారు. రైల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రివెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు ఇటీవలె పట్టుకున్నారు. యశ్వంత్‌పుర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌(Yeshwantpur- Howrah Express)లో బంగారాన్ని తరలిస్తున్నాడన్న పక్కా సమాచారంతో.. ఏపీలోని విశాఖ రైల్వే స్టేషన్​లో బుధవారం మధ్యాహ్నం అధికారులు మాటువేశారు. రైలు రాగానే.. అందులోకి ప్రవేశించి.. నిందితుడిని తనిఖీ చేశారు. అతడి వద్ద ఏకంగా.. రూ.1.91 కోట్లు విలువ చేసే 3.89 కిలోల బంగారం బయటపడింది. నిందితుడు కోల్‌కతా నుంచి ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి తీసుకువచ్చి.. కోల్​కతాలో వివిధ రకాల ఆభరణాలుగా తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని అధికారులు చెప్పారు. నిందితుడిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్లు డీఆర్ఐ(DRI) అధికారులు తెలిపారు.

చాక్లెట్‌ డబ్బాలో..

మరో ఘటనలో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది(gold smuggling in hyderabad airport). కువైట్ ప్రయాణికుడి నుంచి రూ.34.24 లక్షల విలువైన 763.66గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం(gold seized in shamshabad airport) చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో... బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి చాక్లెట్‌ డబ్బాలో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు(gold smuggling in hyderabad airport) తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు... అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఛార్జింగ్ లైట్లలో..

ఛార్జింగ్ లైట్లలో బంగారం తరలిస్తూ ఇటీవలె పట్టుబడ్డారు. శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టులో ఆరు కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ లైట్లలో బంగారం తరలిస్తూ అధికారులను బురిడీ కొట్టించేందుకు ప్రయాణికుడు విఫలయత్నం చేశారు. చివరకు అధికారులు చాకచక్యంగా వ్యవహరించడంతో.. బండారం బయటపడింది.

ఇదీ చదవండి:Harassment at school: బాలికలపై జిల్లా అధికారి వేధింపులు.. చంపేస్తానంటూ బెదిరింపులు

ABOUT THE AUTHOR

...view details