తెలంగాణ

telangana

Rape Attempt on a Maid : పనిమనిషిపై యువకుడి అత్యాచారయత్నం

By

Published : May 5, 2022, 8:33 AM IST

Rape Attempt on a Maid : ఆడపిల్ల ఒంటరిగా కనపడినా.. వాళ్లకి ముందూవెనుకా ఎవరూ లేరని తెలిసినా.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. అబలలపై అన్యాయాలు జరిగిన ప్రతిసారీ.. సమాజంలో మార్పు రావాలని.. వాటిని వ్యతిరేకిస్తూ ఎన్ని కథనాలు రాసినా, బహిరంగ చర్చలు, సమావేశాలు నిర్వహించినా.. మళ్లీ ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగుతూనే ఉన్నాయి. తాజాగా పనిమనిషిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

Rape Attempt on Woman
Rape Attempt on Woman

Rape Attempt on Woman : మృగాళ్లు రెచ్చిపోతున్నారు... నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్​ స్టేషన్ పరిధిలో పనిమనిషిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు అక్కడ నుంచి పారి పోయాడు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పీఎస్​ పరిధిలోని నాదర్గుల్​లో ఓ మహిళ స్థానికంగా నివాసముంటుంది. నాలుగు ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. బుధవారం ఉదయం రోజూ లాగే నడుచుకుంటూ ఓ ఇంట్లో పని చేయడానికి వెళ్తుండగా.. ఓ యువకుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.

ఎమ్​వీఎస్​ఆర్ కళాశాల సమీపంలోకి వెళ్లగానే ఓ యువకుడు అడ్డుకుని ఆమె చేతులు పట్టుకుని అత్యాచారానికి యత్నించాడు. ఆ మహిళ వెంటనే కేకలు వేయడంతో రోడ్డుపై వెళ్తున్న వారు రాగానే ఆ మహిళను వదిలేసి నిందితుడు పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందుతుడిని సాయి రామ్ నగర్​ కాలనీ ఫేస్ వన్ తెరాస ప్రెసిడెంట్ మహేందర్ అనుచరుడు అర్జున్​గా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్ల పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి :అతడు మంచోడే.. కానీ నేను చనిపోతున్నా.. నా డైరీ మాత్రం చదవొద్దు ప్లీజ్!!

ABOUT THE AUTHOR

...view details