తెలంగాణ

telangana

బాలికపై అత్యాచారయత్నం.. రాజీకి రాకుంటే చంపేస్తామని బెదిరింపు

By

Published : Feb 7, 2021, 9:21 AM IST

ఏపీలోని గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో అయిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులను ఆశ్రయించగా రాజీ చేసుకోమని సూచించారని బాలిక కుటుంబసభ్యులు వాపోయారు.

బాలికపై అత్యాచారయత్నం..రాజీకి రాకుంటే చంపేస్తామని బెదిరింపు
బాలికపై అత్యాచారయత్నం..రాజీకి రాకుంటే చంపేస్తామని బెదిరింపు

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన గతనెల 29న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితులు కొల్లిపర పోలీసులను ఆశ్రయించగా రాజీ కుదుర్చుకోవాలని చెప్పినట్లు బాలిక అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడితో పాటు అతని బంధువులు చంపేస్తామని బెదిరిస్తున్నారని బాలిక కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

బాలికపై అత్యాచారయత్నం..రాజీకి రాకుంటే చంపేస్తామని బెదిరింపు

ఇదీ చదవండి:నన్ను హిజ్రాగా మార్చారు.. ఆత్మహత్య చేసుకుంటున్నా..!

ABOUT THE AUTHOR

...view details