తెలంగాణ

telangana

rape attempt: తాతయ్యలే కదా అని వెళ్తే.. దారుణానికి ఒడిగట్టారు..!

By

Published : Aug 24, 2021, 10:56 PM IST

Updated : Aug 24, 2021, 11:16 PM IST

ఇద్దరు వృద్ధులు మాయమాటలు చెప్పి ఓ బాలికను ఇంటికి పిలిచారు. తాతయ్య లాంటి వాళ్లేకదా అని ఆ బాలిక వెళ్లింది. అక్కడి వెళ్లిన తర్వాత వారిలో ఒకరు ఆ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి త్రీటౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీకుసున్నట్లు పోలీసులు తెలిపారు.

rape attempt
బాలికపై అత్యాచార యత్నం

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఓ బాలికపై ఇద్దరు వృద్ధులు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. తెనాలి మండలంలోని పినపాడుకు చెందిన వృద్ధులు అన్వర్(80), అహ్మద్(60).. ఓ బాలికకు మాయమాటలు చెప్పి తమ ఇంటికి రప్పించుకున్నారు.

తాతయ్య లాంటి వాళ్లే కదా అని వాళ్ల మాటలు నమ్మి ఇంటికి వెళ్లిన బాలికపై తొలుత అన్వర్.. అత్యాచారానికి యత్నించాడు. ఈ క్రమంలో బాలిక బంధువులు చూసి కాపాడాడు. ఈ ఘటన సోమవారం జరగ్గా.. బాలిక కుటుంబ సభ్యులు ఇవాళ 3వ పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితులైన వృద్ధులపై కేసు నమోదు చేసి పోలీసులు.. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్న యువకుడు మృతి..?

Last Updated :Aug 24, 2021, 11:16 PM IST

ABOUT THE AUTHOR

...view details