తెలంగాణ

telangana

నెల్లూరులో డీఏవీ పాఠశాల తరహా ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు

By

Published : Nov 12, 2022, 5:31 PM IST

పాఠశాలలో చదివే బాలికలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. చదువుకునేెందుకు పాఠశాలకు వెళ్లే పసి బాలికపై లైంగిక దాడికి యత్నించాడు ఓ కామాంధుడు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది.

నెల్లూరులో బాలికపై అత్యాచార యత్నం
నెల్లూరులో బాలికపై అత్యాచార యత్నం

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా తెలుగు గంగ కాలనీ వద్ద ఓవెల్ స్కూల్​లో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల స్కూల్లో పీఆర్వో పని చేసే బ్రహ్మయ్య అసభ్యంగా ప్రవర్తించినట్లుగా బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. కొద్ది రోజులుగా బాలికను తరగతి గదుల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నిస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బ్రహ్మయ్య బాలికను బెదిరించాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

దీంట్లో భాగంగా బాలిక అస్వస్థతకు గురవడంతో తల్లితండ్రులు గుర్తించి విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యంతో గొడవకు దిగారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బ్రహ్మయ్యను అరెస్ట్ చేశామని తెలిపారు. గతంలోనూ బ్రహ్మయ్య పైన లైంగిక ఆరోపణలు ఉన్నట్లుగా తెలిసింది. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బ్రహ్మయ్యను శిక్షించాలని స్కూల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details