తెలంగాణ

telangana

fake baba gang: సర్పదోషం ఉంది.. శాంతి చేయాలని రూ.₹37 లక్షలు స్వాహా

By

Published : Jul 5, 2022, 4:20 PM IST

fake baba gang: అమాయకులను మోసగిస్తున్న నకిలీ బాబాల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. జబ్బులు నయం చేస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ మహేశ్ భగవత్​ తెలిపారు.

fake baba gang
నకిలీ బాబాల ముఠా

మాయమాటలు చెప్పి అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నకిలీ బాబా ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. భువనగిరి ఎస్‌వోటీ, భువనగిరి టౌన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించి ముఠాను పట్టుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సీపీ మీడియాకు వివరించారు.

"కొండల్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. భువనగిరికి చెందిన కొండల్ రెడ్డి ట్రాన్స్‌పోర్టు బిజినెస్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనంపై నుంచి కింద పడ్డారు. దోషం ఉందని.. శాంతి చేయకపోతే ప్రాణాలు పోతాయని కొండల్ రెడ్డిని ముఠా నమ్మించింది. ఇందుకు కొండల్ రెడ్డి దగ్గర నుంచి విడతల వారీగా రూ.37.71 లక్షలు వసూలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశాం. నిందితుల నుంచి రూ.8 లక్షలు నగదు, కౌంటింగ్ మిషన్, రుద్రాక్ష మాలలు, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం."

- మహేశ్ భగవత్, రాచకొండ సీపీ

తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని సీపీ వెల్లడించారు. నిందితులు రాజస్థాన్‌ నుంచి తెలంగాణకు వచ్చి మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

కౌన్‌ బనేగా కరోడ్‌పతి పేరుతో మోసం..:కౌన్‌ బనేగా కరోడ్‌పతి పేరుతో రూ.3 కోట్ల మేర మోసాలకు పాల్పడిన సైబర్‌ నేరగాడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు సహా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా నిందితుడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటీవలే ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని బిహార్‌లో అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.

ఇవీ చదవండి:CP On Fake Certificates: నకిలీ ధ్రువపత్రాల దందా.. నలుగురు అరెస్ట్

రాహుల్​ గాంధీపై ఆ వీడియోలు.. టీవీ యాంకర్​ అరెస్టుపై రెండు రాష్ట్రాల వార్​!

ABOUT THE AUTHOR

...view details