తెలంగాణ

telangana

వాహన తనిఖీలు.. ఇసుక లారీలు సీజ్

By

Published : Mar 6, 2021, 6:24 PM IST

భూపాలపల్లి పట్టణంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. 6 ఇసుక లారీలను సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని లారీ ఓనర్లను ఎస్సై ఉదయ్ కిరణ్ హెచ్చరించారు.

Police have seized six heavy sand lorries in Bhupalpally town
వాహన తనిఖీలు.. ఇసుక లారీల సీజ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలో అధిక లోడుతో వస్తున్న 6 ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. లారీలను మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్​కు అప్పగించారు. ఇక మీదట ఎవరైనా.. లారీల్లో అధిక లోడుతో ఇసుక తరలిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. వాటిని సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఓనర్లను హెచ్చరించారు.

డీఎస్పీ, సీఐ ఆదేశాలతో ట్రైనీ ఎస్సైలు రాజు, రాధిక, సిబ్బందితో కలిసి బాంబుల గడ్డ వద్ద వాహనతనిఖీలను ఎస్సై ఉదయ్ కిరణ్ నిర్వహించారు.

ఇదీ చూడండి:కమీషన్​ ఆశచూపి.. రూ.1500 కోట్లు కాజేసి!

ABOUT THE AUTHOR

...view details