తెలంగాణ

telangana

హైదరాబాద్​లో రూ.1.24 కోట్ల హవాలా డబ్బు పట్టివేత

By

Published : Sep 29, 2022, 9:49 PM IST

Updated : Sep 30, 2022, 10:33 AM IST

హైదరాబాద్‌
హైదరాబాద్‌ ()

21:47 September 29

హైదరాబాద్​లో రూ.1.24 కోట్ల హవాలా డబ్బును పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌లో తరలిస్తున్న హవాలా డబ్బును సెంట్రల్ జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మాసబ్‌ట్యాంక్‌ పరిధిలో షోయబ్‌ అనే వ్యక్తి వద్ద రూ.1.24 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్‌ మీరట్‌కు చెందిన షోయబ్‌ మాలిక్‌ హైదరాబాద్‌ వచ్చి పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. బంధువు కామిల్‌ సూచన మేరకు అతను హవాలా డబ్బు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

గుజరాత్‌ గల్లీకి చెందిన భరత్‌ నుంచి షోయబ్ నగదు తీసుకున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు షోయబ్​ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిందితుడి వద్ద నుంచి రూ.1.24 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి లెక్క చెప్పకపోవడంతో హవాలా డబ్బులు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.1.24 కోట్ల నగదును పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి..

బాల్క సుమన్ అభిమాని అత్యుత్సాహం.. ఏకంగా బుల్లెట్​లతోనే..!

బ్రహ్మాస్త్ర సీక్వెల్స్​పై అదిరిపోయే అప్డేట్స్​.. ఏంటంటే?

Last Updated :Sep 30, 2022, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details