బాల్క సుమన్ అభిమాని అత్యుత్సాహం.. ఏకంగా బుల్లెట్​లతోనే..!

author img

By

Published : Sep 29, 2022, 10:40 PM IST

బాల్క సుమన్​ అభిమాని

Fan enthusiasm with GUN BULLETES: బుల్లెట్​లతో తన అభిమాన వ్యక్తి పేరు రాశాడు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.. చివరికి అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు!

Fan enthusiasm with GUN BULLETES: ప్రభుత్వ విప్​ బాల్క సుమన్ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన కొప్పుల రవి అనే సింగరేణి కార్మికుడు శ్రీరాంపూర్​లోని ఎస్ఆర్పీ ఒకటో గనిలో విధులు నిర్వహిస్తున్నాడు. రవి తన వాట్సాప్ స్టేటస్​లో జై బాల్క సుమన్ అని బుల్లెట్లతో అమర్చిన పేర్లను స్టేటస్​గా పెట్టుకున్నాడు.

అభిమాని అత్యుత్సాహం
అభిమాని అత్యుత్సాహం

అది కాస్తా సామాజిక మాధ్యమాలలో వైరల్​గా మారింది. అసలు అతనికి బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు ఆరా తీశారు. చివరికి ఛత్తీస్​గఢ్​లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తోన్న తన స్నేహితుని వాట్సాప్ స్టేటస్ నుంచి కొప్పుల రవి స్టేటస్​గా పెట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.