తెలంగాణ

telangana

మద్యం తాగించి యువకుడి దారుణ హత్య.. నిందితుల అరెస్ట్​

By

Published : Mar 21, 2021, 10:43 PM IST

యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. ఈనెల 10న కోయిలకొండ స్టేషన్​లో అదృశ్యమైనట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు. నిందితుల్లో మృతునికి బంధువైన మైనర్​ బాలుడు ఉన్నాడు. మేక హనుమాన్ తండా సమీపంలో గుట్ట వద్ద పాతిపెట్టిన వెంకట్ నాయక్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు

one person murder in  meka nayak thanda in narayanapet district
మద్యం తాగించి యువకుడి దారుణ హత్య

అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. మద్యం సీసాలో పురుగుల మందు కలిపి అంతమొందించారు. నిందితుల్లో ఒకరు మైనర్​ బాలుడు, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని మద్దూరు మండలం గోకుల్ నగర్ తండాకు చెందిన వెంకట్ నాయక్ (24) మహబూబ్​నగర్​లో ఆపరేటర్​గా పని చేస్తున్నట్లు డీఎస్పీ మధుసూదన్​రావు వెల్లడించారు.

ఈనెల 10న అదృశ్యం

ఈనెల 10న కోయిల్​కొండ స్టేషన్ పరిధిలో యువకుడు కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబసభ్యులు వెతుకుతుండగా వింజమూరు సమీపంలో రహదారి పక్కన యువకుని ద్విచక్ర వాహనం ధ్వంసమై కనిపించింది. దీనిపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు.

చంపి పూడ్చిపెట్టారు

ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు గోకుల్ నగర్ తండాకు చెందిన మైనర్ బాలుడు, మేక హనుమాన్ తండాకు చెందిన ఉమాపతిని విచారించగా తామే హత్య చేసి పూడ్చినట్లు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. దీంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో మేక హనుమాన్ తండా సమీపంలో గుట్ట వద్ద పాతిపెట్టిన వెంకట్ నాయక్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలంలోనే రెవెన్యూ అధికారులు పంచనామా చేయగా.. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పక్కా ప్లాన్​ ప్రకారమే హత్య

గోకుల్ నగర్ తండాకు చెందిన మైనర్ బాలుడు, మేక హనుమాన్ తండాకు చెందిన ఉమాపతి పక్కా ప్లాన్ ప్రకారం వెంకట్ నాయక్​ను మద్యం తాగేందుకు తీసుకెళ్లారు. తండా సమీపంలోని పిట్టలవాని కుంట ప్రాంతంలో ముగ్గురు కలిసి మద్యం తాగారు. వెంకట్ నాయక్ మూత్రం చేసి వస్తానని పక్కకు వెళ్లిన సమయంలో మద్యంలో పురుగుల మందు కలిపారు. అనంతరం వచ్చిన వెంకట్ నాయక్ మద్యం తాగడంతో కొంతసేపటి తర్వాత వాంతులు చేసుకుంటున్న సమయంలో వెనక నుంచి ఇద్దరు సుత్తితో తలపై బాదడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడే గుట్ట ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఆ ప్రాంతమంతా కంది కట్టెలతో కాల్చారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయట పడడం వల్ల నిందితులు నేరం అంగీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:పుట్​పాత్​ను ఢీ కొన్న ద్విచక్రవాహనం.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details