తెలంగాణ

telangana

రెండు కార్లు ఎదురెదురుగా ఢీ.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు

By

Published : Mar 18, 2022, 6:49 PM IST

Car Accident: రెండు కార్లు ఎదురురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

రెండు కార్లు ఎదురెదురుగా ఢీ.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు
రెండు కార్లు ఎదురెదురుగా ఢీ.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు

Car Accident: హోలీ పర్వదినాన విషాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల గ్రామ శివారులోని గట్టమ్మ దేవాలయం సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్ల వెనుకే వచ్చిన ద్విచక్రవాహనాన్ని కూడా వాహనాలు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ములుగు నుంచి ఏటూరు నాగారం వెళ్లే రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. వెనుకే వచ్చిన ద్విచక్రవాహనాన్ని కూడా వాహనాలు ఢీకొట్టాయి. దీంతో పాటు ఆ కార్ల వెనుకే వచ్చిన మరో కారు కూడా అదుపుతప్పి ఈ వాహనాలను ఢీకొంది. ఈ ఘటనలో ఓ కారులోని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుడి మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి వరంగల్​ నగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details