తెలంగాణ

telangana

గుర్తు తెలియని వాహనం ఢీ... ఒకరు మృతి

By

Published : Jan 24, 2021, 9:41 PM IST

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని, గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

one person dead in road accident in Kamareddy district
గుర్తు తెలియని వాహనం ఢీ... ఒకరు మృతి

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బోధన్​కు చెందిన లక్ష్మీ నారాయణ వరికోత మిషన్​ యజమాని. దాని డ్రైవర్ సురేష్​తో కలిసి ద్విచక్ర వాహనంపై బోధన్ వెళ్తున్నారు. గుర్తు తెలియని వాహనం వారిని ఢీ కొట్టడంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ సురేష్​ను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details