తెలంగాణ

telangana

శుభకార్యానికి వెళ్లొస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

By

Published : Apr 13, 2021, 2:06 PM IST

సూర్యాపేట జిల్లా చింతలకుంట తండా వద్ద లారీ, బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. శుభకార్యానికి వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు తెలిపారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

road accident, one person dead in road accident
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, సూర్యాపేట జిల్లా రోడ్డు ప్రమాదం

శుభకార్యానికి వెళ్లొస్తుండగా లారీ, ద్విచక్రవాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం చింతలకుంట తండా స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రత్నవరం గ్రామానికి చెందిన వెలుగు కరుణాకర్ మామిడాల గ్రామంలో ఓ విందుకు హాజరై... తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

ABOUT THE AUTHOR

...view details