తెలంగాణ

telangana

RTC Bus: ఆర్టీసీ బస్సులో వృద్ధుడి ఆకస్మిక మృతి

By

Published : Aug 18, 2021, 6:53 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి హన్మకొండ వెళ్లే బస్సులో వృద్ధుడు ఆకస్మికంగా మృతి చెందారు. ఆర్టీసీ బస్సులో(RTC BUS) కూర్చున్నచోటే ఆయన కుప్పకూలడం ప్రయాణికులను కలవరపెట్టింది. ఆయన వద్ద ఉన్న ఆధారాలతో పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.

old man dead in RTC Bus, husnabad bus stand
ఆర్టీసీ బస్సులో వృద్ధుడి ఆకస్మిక మృతి, ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి హన్మకొండ వెళ్లే బస్సు ఎక్కిన ఇప్పకాయల రాజేశం (85) అనే వృద్ధుడు ఆకస్మికంగా మృతి చెందారు. ఆర్టీసీ బస్సులో(RTC Bus) కూర్చున్న చోటే కుప్పకూలడం... ప్రయాణికులను కలవరానికి గురి చేసింది. ఇది గమనించిన కండక్టర్ బస్టాండ్ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. కంట్రోలర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా... వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతుడు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్‌పల్లి గ్రామానికి చెందిన వృద్ధుడిగా పోలీసులు గుర్తించారు. వృద్ధుడి వద్ద రెండు సంచుల్లో కొత్త బట్టలు ఉండడంతో ఇంటింటికి తిరుగుతూ బట్టలు అమ్ముకునే వ్యక్తిగా భావిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు పోలీసులు సమాచారం అందించారు.

ఇదీ చదవండి:auto driver harassment: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. ఆటో డ్రైవర్​పై కేసు

ABOUT THE AUTHOR

...view details