తెలంగాణ

telangana

సారీ చెబితే పోయేదానికి ప్రాణం తీశాడు.. కటకటాల పాలయ్యాడు..

By

Published : Dec 22, 2022, 9:26 AM IST

Updated : Dec 22, 2022, 4:56 PM IST

Car accident in Gachibowli: రాయదుర్గం ప్రమాదానికి కారణమైన నిందితుడు రాజసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే కారుతో వారిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై 302, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

hit by a car
hit by a car

Car accident in Gachibowli: రాయదుర్గం పోలీస్​స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనాన్ని కారుతో ఢీకొట్టి, మహిళ మృతికి కారణమైన నిందితుడు రాజసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే కారుతో వారిని ఢీకొట్టినట్లు తెలిపారు. నిందితుడిపై 302, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేవలం క్షమాపణతో పోయేదానికి రాజసింహారెడ్డి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడని.. తన జీవితాన్నీ నాశనం చేసుకున్నాడని చెప్పారు. నిందితుడిని రిమాండ్​కు తరలించడంతో పాటు.. అతని తల్లిదండ్రులకు సైతం కౌన్సిలింగ్ ఇస్తామని స్పష్టం చేశారు.

అసలేెెం జరిగిదంటే:ఎర్రగడ్డకు చెందిన సయ్యద్‌ సైఫుద్దీన్‌ (27) వ్యాపారం చేస్తుంటారు.ఈ నెల 18న అర్ధరాత్రి 1.30 సమయంలో.. ఆయన తన భార్య మారియా మీర్‌(25), వరుసకు సోదరులయ్యే సయ్యద్‌ మిరాజుద్దీన్‌(24), రాషెద్‌ మాషా ఉద్దీన్‌(19)తో కలిసి రెండు ద్విచక్రవాహనాలపై ఎర్రగడ్డ నుంచి మాదాపూర్‌ తీగల వంతెన మీదుగా గచ్చిబౌలికి బయలుదేరారు. ఏఐజీ సమీపంలోకి రాగానే, బెంజ్‌ కారులో వెళ్తున్న జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి రాజసింహారెడ్డి(26) అక్కడి రోడ్డుపై ఉన్న నీటిలో నుంచి దూసుకెళ్లడంతో సైఫుద్దీన్‌ సోదరులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై ఆ నీరు పడింది. దీంతో వారు కారు డ్రైవర్‌ను వెంబడించి.. అలా ఎందుకు చేశావని, కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా వెళుతున్నావంటూ నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో ఆగ్రహించిన రాజసింహారెడ్డి వారిని కారుతో ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడిపోయారు. దీన్ని గమనించిన సైఫుద్దీన్‌, మారియాలు వెంటపడి.. కారు డ్రైవర్‌ ఆగడాలపై ప్రశ్నించారు. మళ్లీ వారిని ఢీకొట్టాడు. దీంతో మారియా వాహనంపై నుంచి ఎగిరి కొద్దిదూరంలో పడి తీవ్ర గాయాలకు గురైంది. మారియా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. మారియాకు 8 నెలల పాప ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 22, 2022, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details