తెలంగాణ

telangana

ప్రాణాల మీదకు తెచ్చిన ఆస్తి తగాదాలు.. సోదరులు వేధిస్తున్నారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By

Published : Jan 30, 2023, 9:14 PM IST

Suicide Attempt: అన్నదమ్ములు అంటేనే ఎంతో ఆప్యాయతగా.. అనురాగంగా కలిసి ఉంటారు. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ తమ బంధాన్ని కడదాకా కొనసాగిస్తారు. కానీ మారుతున్న సమాజంలో ఆ విలువలు, ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. కుటుంబాల మధ్యలో ఆస్తి తగాదాలు చిచ్చురేపుతున్నాయి. అయిన వారే శత్రువులుగా మారుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనే ఇందుకు ఉదాహరణ.

Man commits suicide
Man commits suicide

Suicide Attempt: ఆస్తి తగాదాలతో వచ్చిన గొడవలలో అయిన వారే శత్రువులుగా మారుతున్నారు. కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన దగ్గరి వారే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఆస్తి వివాదాలతో ఓ వక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగారం గ్రామంలో చోటుచేసుకొంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దుర్గోళ్ల కృష్ణకు పోచయ్య, బలరాం అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆస్తి పంపకాల్లో తనకు రావాల్సిన రెండు గుంటల భూమిని తన సోదరులు ఇవ్వకుండా పోలీసులతో తరచూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ బాధితుడు తెలిపాడు.

బాధితుడు దుర్గోళ్ల కృష్ణ

దీనికి తోడు తన ప్రమేయం లేకుండానే తమ భూమిని కూడా సోదరులు అమ్మేశారని ఆరోపించాడు. తరచూ పోలీస్ స్టేషన్​కు రప్పించి పోలీసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈరోజూ స్టేషన్​కు పిలిపించడంతో మనస్తాపంతో స్థానిక దుకాణాల సముదాయం ముందు పెట్రోలు​ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు గమనించి వెంటనే మంటలను ఆర్పివేసి అతన్ని ప్రాణపాయం నుంచి తప్పించారు.

ఈ ఘటనపై హత్నూర ఎస్సై లక్ష్మారెడ్డిని వివరణ కోరగా.. ఇందులో తాము ఎవరినీ ఇబ్బందులకు గురి చేయలేదని.. కేసు విషయంలో అన్నదమ్ములందరూ స్టేషన్​కు వచ్చారని పేర్కొన్నారు. అయితే కాసేపటికే వారు కలిసి మాట్లాడుకుంటామని బయటకు వెళ్లారని.. అక్కడ ఏం జరిగిందో తెలియదని వివరణ ఇచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details