తెలంగాణ

telangana

Suicide: సెల్ఫీ వీడియో పెట్టారు.. కనిపించకుండా పోయారు

By

Published : Jun 28, 2021, 10:50 PM IST

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి జలాశయం వద్ద ఇద్దరు యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమికులు కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను బొబ్బిలికి చెందిన రాకేశ్‌, కురుపాంనకు చెందిన మైనర్‌ బాలికగా భావిస్తున్నారు.

సెల్ఫీ వీడియో పెట్టారు.. కనిపించకుండా పోయారు
సెల్ఫీ వీడియో పెట్టారు.. కనిపించకుండా పోయారు

సెల్ఫీ వీడియో పెట్టారు.. కనిపించకుండా పోయారు

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజ్​లో ఇద్దరు యువతీ యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు ప్రేమికులు కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బొబ్బిలికి చెందిన రాకేశ్​, కురుపాంనకు చెందిన ఓ మైనర్ బాలిక కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరు తోటపల్లి బ్యారేజ్​లో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ సెల్ఫీ వీడియో పెట్టినట్లు వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రాకేశ్​ బైక్​తో పాటు మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా గజ ఈతగాళ్లతో వెతికించటంతో పాటు.. ఇతర ప్రాంతాల్లో అన్వేషిస్తున్నారు.

ఇదీ చదవండీ..పెళ్లి అనగానే పరారైన యువకుడు..

ABOUT THE AUTHOR

...view details