తెలంగాణ

telangana

పెద్దలకు చెప్పలేక.. విడిపోయి బతకలేక.. ప్రేమ జంట ఆత్మహత్య..

By

Published : Jan 3, 2022, 10:14 AM IST

Updated : Jan 3, 2022, 12:54 PM IST

Lovers Suicide, lovers committed suicide
ప్రేమ జంట ఆత్మహత్య

10:09 January 03

Lovers Suicide: బుధేరా శివారులో మృతదేహాలు గుర్తింపు

Lovers Committed Suicide: ఇద్దరూ బంధువులే. ఓ కుటుంబ వేడుకలో కలిసిన వీరి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇంకేముంది ఇద్దరూ గంటల తరబడి ఫోన్లు మాట్లాడుకునేవారు. ఎప్పుడూ ఇంట్లో ఎలా చెప్పాలి.. పెద్దలను తమ పెళ్లికి ఎలా ఒప్పించాలనే మధనపడుతూ ఉండేవారు. చివరికి తల్లిదండ్రులతో చెప్పే ధైర్యం చేయలేకపోయారు. కలిసి జీవించే ధైర్యం లేక.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబానికి శోకం మిగిల్చారు. సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలంలోని బుధేరాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధేరా శివారులో మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మృతుల బ్యాగులోని లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులకు చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతులు లేఖలో వెల్లడించారని పోలీసులు తెలిపారు. మృతురాలు కోహీర్‌కు చెందిన బొక్కల అమృతగా, మృతుడు వికారాబాద్ జిల్లా సిరిపురానికి చెందిన శివగా గుర్తించారు. ప్రేమికులు బంధువులని పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఇంట్లో గ్యాస్ లీక్.. కుమార్తె సహా దంపతులు సజీవదహనం

Last Updated : Jan 3, 2022, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details